BRO: మేనేజర్ తో గొడవపడ్డ తేజ్ – కారణం..?

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ బ్రో మూవీ సెట్స్ లో మేనేజర్ తో గొడవపడ్డాడని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. గొడవకి కారణం ఏంటన్నది తెలియట్లేదు కానీ, క్యారవాన్లో ఇద్దరు నువ్వెంతంటే, నువ్వెంత అనే రేంజ్ గొడవపడ్డారని సమాచారం అందుతోంది. నిజానికి చాలా సౌమ్యంగా ఉండే తేజ్ మేనేజర్ పై ఈ రేంజ్ ఫైర్ అయ్యాడంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. స్వతహాగా మెగాఫ్యాన్ అయిన తేజ్ మేనేజర్ సతీష్ తనకి మంచి స్నేహితుడు, వృత్తి రీత్యా సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన సతీష్ ని జాబ్ మానిపించి మరీ మేనేజర్ అపాయింట్ చేసుకున్నాడట. అప్పటి నుండి ఎంతో నమ్మకంగా ఉంటూ వస్తున్న సతీష్ తేజ్ కి యాక్సిడెంట్ అయిన నాటి నుండి రికవర్ అయ్యేంత వరకు తేజ్ వద్దే ఉన్నాడట.

ఇటీవల విడుదలైన తేజ్ సినిమా విరూపాక్ష ద్వారా డిస్ట్రిబ్యూషన్ రంగంలో కూడా అడుగుపెట్టాడు సతీష్. అలాంటి ప్రాణ స్నేహితులు గొడవపడ్డారంటే ఏదో సీరియస్ కారణమే ఉంది ఉంటుందని టాక్ వినిపిస్తోంది. తేజ్ సినిమాల ప్లానింగ్ దగ్గర నుండి పబ్లిసిటీ వరకు సతీష్ చాలా కేర్ తీసుకునేవాడని టాక్ ఉంది. సతీష్, తేజ్ లు మేనేజర్, హీరోలా కాకుండా మంచి స్నేహితుల్లా ఉంటారని అనుకుంటూ ఉంటారు.

ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమా జులై 28న విడుదలకి సిద్ధమవుతోంది. పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన ఈ సినిమా తేజ్ కెరీర్లో స్పెషల్ గా నిలవనుంది. తమిళ సినిమా వినోదాయ సీతాం సినిమాకి రీమేక్ గా రుప్పొందిన ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ లు హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేసిన నేపథ్యంలో రిలీజ్ అయ్యాక ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు