Thunivu : తెలుగు టైటిల్ ఫిక్స్

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నుంచి వస్తున్న తాజా చిత్రం తునివు. అజిత్ కు వాలిమై, నేర్కొండ పార్వై వంటి హిట్స్ ఇచ్చిన హెచ్.వినోత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. బేవ్యూ ప్రాజెక్ట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బోనీ కపూర్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్టు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన రెండు పోస్టర్లు భారీ స్థాయిలో అంచనాలను పెంచాయి.

తాజాగా చిల్లా చిల్లా అనే సాంగ్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ కూడా అజిత్ అభిమానుల్లో జోష్ నింపింది. ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. తెలుగు హక్కులను రాధాకృష్ణ ఎంటర్ టైన్ మెంట్స్ దక్కించుకుంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమా తెలుగు వర్షెన్ కు సంబంధించి ఒక ఆసక్తిరమైన వార్త వైరల్ అవుతుంది. అజిత్ తునివు ను తెలుగులో “తెగింపు” అనే టైటిల్ తో విడుదల చేయబోతున్నారని టాక్.

అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అతి త్వరలోనే “తునివు” తెలుగు టైటిల్ “తెగింపు” అని అధికారిక ప్రకటన రానుందని టాలీవుడ్ వర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. కాగా కోలీవుడ్ నుంచి అజిత్ తునివుతో పాటు తలపతి విజయ్ వారిసు సినిమా కూడా తెలుగులో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. వారిసుకు తెలుగు టైటిల్ గా వారసుడు అని ఇది వరకే అధికారిక ప్రకటన వచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు