Thalapathy 67 : లోకీ యూనివర్స్ కి భారీ ప్లాన్

లోకేష్ కనగరాజ్.. ఈ యంగ్ డైరెక్టర్ పేరు కొద్ది రోజుల్లోనే పాన్ ఇండియా స్థాయిలో మార్మోగిపోయింది. లోకీ యూనివర్స్ అని ఒకటి క్రియేట్ చేసి దానిలో.. ఖైదీ, విక్రమ్ లాంటి సినిమాలను తెరకెక్కించాడు. ఈ రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ముందుగా కార్తీ తో ఖైదీ చేసిన సమయంలో తన యూనివర్స్ గురించి పెద్దగా చెప్పలేదు. కానీ కమల్ హాసన్ తో తెరకెక్కించిన విక్రమ్ తో తన లోకీ యూనివర్స్ ను ప్రకటించాడు.

విక్రమ్ సినిమాలో కమల్ హాసన్, ఫహద్ ఫజిల్, విజయ్ సేతుపతి, సూర్య లాంటి స్టార్ కాస్ట్ పెట్టడంతో సినిమా సూపర్ హిట్ అవడమే కాదు.. ఈ యూనివర్స్ లో తర్వాత వచ్చే సినిమాలపై అంచనాలను కూడా పెంచింది. కాగా విక్రమ్ తర్వాత లోకేష్ కనగరాజ్ నుంచి వస్తున్న సినిమా దలపతి67. విజయ్ దలపతి హీరోగా వస్తుంది. ఈ సినిమా కూడా లోకీ యూనివర్స్ లో భాగంగానే వస్తుందని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. త్వరలోనే సాలిడ్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాలో ఉండే పాత్రలపై సర్వత్ర ఆసక్తి ఉంది. ఎందుంటే, దలపతి67 సినిమా లోకీ యూనివర్స్ లో భాగంగా వస్తే.. ఈ సినిమాలో వచ్చే పాత్రలు మరిన్నీ సినిమాల్లో కనిపించే అవకాశం ఉంది. ఇప్పటికే దలపతి 67లో బాలీవుడ్ సీనియిర్ నటుడు సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్, మన్సూర్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించనున్నారని టాక్ వస్తోంది. అలాగే కన్నడ స్టార్ రక్షిత్ శెట్టి కూడా కీలక పాత్ర చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి.

- Advertisement -

తాజాగా విక్రమ్ సినిమాలో కనిపించిన ఫహద్ ఫజిల్ కూడా దలపతి67లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా మొత్తం స్టార్ కాస్ట్ నిండి ఉంటుందని అర్థమవుతుంది. కాంబినేషన్ తో అంచనాలు పెంచేసిన ఈ చిత్రం, ఇప్పుడు కాస్ట్ విషయంలో కూడా అంచనాలను రోజు రోజుకు పెంచుకుంటుంది.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు