Thamannah : మాస్ స్టెప్పులకు తోడుగా..

చూస్తుండగానే నాని ఖాతాలో రెండు ఫ్లాపులు పడిపోయాయి. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన ఉన్నాడు. అలా ఆయన చేసిన సినిమానే ‘దసరా’. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహించాడు. నాని సరసన నాయికగా కీర్తి సురేష్ కనిపించనుంది. ఆయన కాంబినేషన్ లో ఆమెకి ఇది రెండూ సినిమా. దసరాలో నాని పక్క మాస్ లుక్ తో కనిపించనున్నాడు.

రామగుండం బొగ్గు గనుల నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్, సత్యన్ సూర్యన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే, తాజాగా ఈ చిత్రంలో మరో స్పెషల్ ఐటమ్ సాంగ్ ఉందని తెలుస్తోంది. ఈ సాంగ్ లో మిల్కీ బ్యూటీ తమన్నా ను తీసుకునే ఆలోచనలు మేకర్స్ ఉన్నారట. మరి తమన్నా ఈ స్పెషల్ సాంగ్ కి అంగీకారం తెలుపుతుందో లేదో చూడాలి.

హీరోయిన్ గా ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆడపాదడప ఐటెం సాంగ్స్ చేస్తుంది తమన్నా. కాగా బిజీబిజీగా గడిపేస్తున్న మిల్కీ బ్యూటీ, ఇటీవల గని సినిమాలో ఓ ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. కొడితే.. అనే లిరిక్స్ తో సాగే పాటకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు నాని కోసం తమన్నా స్టెప్పులు వేయనుందన్నమాట. మరి ఈ ఐటెం సాంగ్ కు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వెయిట్ చేయాలి. దాని కంటే ముందు.. నానితో స్పెషల్ సాంగ్ లో కనిపించడానికి ఈ మిల్కీ బ్యూటీ అంగీకరిస్తాందో లేదో కూడా చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు