Bollywood: ఆ స్టార్ హీరోయిన్ గతే మరో హీరోయిన్ కు పట్టనుందా?

బాలీవుడ్ లో రోజురోజుకి సాంప్రదాయ విలువలు తగ్గిపోతున్నాయి. బాలీవుడ్ సినీ ఫ్యామిలీలకు చెందిన వారసులు కనీసం తాము ఇండియన్స్ అన్నది కూడా మరిచి, పద్ధతులు మరిచి మరీ బరి తెగించి ప్రవర్తిస్తున్నారు ఇప్పటి తారలు. మొన్న వీణా, నిన్న రియా, నేడు ఇలియానా. వీళ్లంతా కెరీర్ మొదట్లో బాగానే ఉన్నా తర్వాత బాలీవుడ్ మోజులో అక్కడి ట్రెడిషన్ ను తలకెక్కించుకొని తమ పరువును గంగపాలు చేసుకున్నారు. ఒకరు ఎక్స్ పోసింగ్ అంటూ అందాలారబోస్తే, మరొకరు చెడు సావాసాలతో కెరీర్ నాశనం చేసుకున్నవారు, ఇంకొకరు పెళ్ళికిముందే తల్లైన వారు, పైగా ఆ వ్యక్తి గురించి కూడా ప్రపంచానికి చెప్పట్లేదంటే వారు వాళ్ళు ఎంతకు తెగించారో అర్ధమవుతుంది.

ఇప్పుడు అలాంటి వార్తే బాలీవుడ్ తో పాటు టాలీవుడ్లోను వైరల్ అవుతుంది. బాలీవుడ్ పై మోజుతో వచ్చిన అవకాశాల్ని సైతం వదులుకుని అక్కడే సెటిల్ అయిన ఒకప్పటి టాలీవుడ్ స్టార్ నటి పరిస్థితి ఇలాగే ఉంది. తెలుగు మంచి కెరీర్ ఉన్నా బాలీవుడ్ కి చెక్కేసిన ఆ హీరోయిన్ రీసెంట్ గానే తన తమ్ముడ్ని బాలీవుడ్ లో హీరోగా పరిచయం చేసింది. మొదటి సినిమా ఆడకపోయినా ఆ నటుడు తన అనుచిత ప్రవర్తనలతో కాంట్రవర్సీలకు కేరాఫ్ అయ్యాడు. తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఒక ముంబై కి చెందిన హీరోయిన్ తో ఆ స్టార్ నటి తమ్ముడు ముంబై వీధుల్లో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. అంతే కాదు వారిద్దరూ పెళ్ళికి ముందే రేలేషన్ షిప్ లో ఉండడం వల్ల బాలీవుడ్ లో ఒక్కసారిగా వైరల్ అయ్యారు.

అంతే కాదు వీరి వల్ల హిందీ చిత్ర పరిశ్రమకు ఉన్న కాస్త పరువు పోతుందని, ఆ జంటను బాలీవుడ్ లో బ్యాన్ చేసే ఆలోచనలో బాలీవుడ్ ఉందని సమాచారం అందింది. ఇక వీళ్ళని ప్రోత్సహిస్తున్న ఆ స్టార్ హీరోయిన్ ని కూడా సినిమా ఛాన్సులు ఇవ్వకూడదని హిందీ చిత్ర నిర్మాతలు భావిస్తున్నారని బాలీవుడ్ చిత్ర వర్గాల టాక్. మరి ఇప్పటి వరకు అఫిషియల్ గా తమ పేర్లు కూడా బయటకి చెప్పుకొని ఆ జంట ఇకనైనా సొసైటీ లోకి వచ్చి తమ నిజాయితీని నిరూపించుకుంటారా? లేదా తమ కెరీర్ ని నాశనం చేసుకుంటారా అనేది చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు