Pushpa2: ఈ రూమర్స్‌కి బ్రేక్ పడేది ఎప్పుడు మాస్టారు ?

ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ ‘పుష్ప-2 ది రూల్’. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘పుష్ప ది రైజ్’ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. దాదాపు రూ. 300 కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీలో అల్లు అర్జున్ స్టైల్ కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది.

తగ్గేదేలే అంటూ క్రికెటర్స్ నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ ఫాలో అయ్యారు. దాంతో పుష్ప పార్ట్ 2 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే లీక్ అవుతున్న కొన్ని వార్తలు మూవీ పై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. పుష్ప పార్ట్ 1 కి కొనసాగింపుగా తెరకెక్కుతున్న “పుష్ప ది రూల్” పార్ట్ 2 ను మరింత గ్రాండ్ గా తెరకెక్కించేందుకు సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడట.

దాంతో ముందుగా అనుకున్న కథను చాలా వరకు మార్పులు చేసి యాక్షన్ డోస్ ఇంకాస్త పెంచనున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. అయితే ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు. దీంతో రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇటీవల ఈ సినిమాలో పలువురు నటీనటులు నటిస్తున్నారు అంటూ చాలా రూమర్స్ వచ్చాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ వార్త ఇప్పుడు నెట్టింట బాగా వినిపిస్తోంది.

- Advertisement -

అదేమిటంటే ఈ సినిమాలో కీలకపాత్రలో సాయి పల్లవి నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్, రష్మిక, ఫహద్ ఫాజిల్ కాంబినేషన్ సీన్లలో సాయి పల్లవి నటించబోతున్నట్టు సమాచారం. ఇందుకోసం సాయి పల్లవి 10 రోజులు కాల్ షీట్స్ ఇచ్చారట.

అయితే ఈ వార్తల్లో నిజం లేదంటూ కూడా న్యూస్ వస్తుంది. నిజానికి సాయి పల్లవి చాలా రోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉంటుంది. కోయంబత్తుర్ లో హాస్పటల్ కడుతున్న సాయి పల్లవి ఇప్పట్లో సిల్వర్ స్క్రీన్ పై కనిపించే పరిస్థితులు లేవు. కోలీవుడ్, బాలీవుడ్ తో పాటు టాలవుడ్ నుంచి కూడా పలు క్రేజీ ఆఫర్లు ఆమెకు వచ్చాయి. కానీ, హాస్పటల్ నిర్మాణం పూర్తి అయిన తర్వాత ఎంట్రీ ఇస్తానని అన్నింటినీ రిజక్ట్ చేస్తూ వస్తుంది. మరి ఇప్పుడు పుష్ప2లో సాయిపల్లవి నటిస్తుందా అనేదానిపై క్లారిటీ రావాలంటే.. డైరెక్టర్ సుకుమార్ స్పందించాల్సిందే.

సాయి పల్లవి విషయంలోనే కాదు.. పుష్ప2కి సంబంధించి రోజుకో వార్త వస్తుంది. ఇలాంటి రూమర్స్ బ్రేకులు పడాలంటే.. లెక్కాల మాస్టారు సుకుమార్ సినిమాపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తే సరిపోతుంది అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు