#VarunLav: వరుణ్ – లావణ్య ల ఎంగేజ్మెంట్ డీటెయిల్స్ ఇవే..!

గత కొంత కాలంగా వార్తలొస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, డింపుల్ క్వీన్ లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ ముహూర్తం రానే వచ్చింది. నిన్న సోషల్ మీడియాలో ఇన్విటేషన్ కి సంబందించిన ఫోటో వైరల్ అవ్వటంతో ఎంగేజ్మెంట్ కి సంబందించిన ఇతర డీటెయిల్స్ కోసం అటు మెగా ఫ్యాన్స్ తో పాటు, సాధారణ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నాగబాబు ఇంట్లో ప్రైవేట్ జరగనున్న ఈ ఎంగేజ్మెంట్ డీటెయిల్స్ ఎట్టకేలకు బయటికి వచ్చాయి. ఈ రోజు (09/06/2023) సాయంత్రం 7 గంటల నుండి 8గంటల మధ్య వరుణ్ లావణ్య ల నిశ్చితార్దానికి ముహూర్తం ఫిక్స్ చేసారని సమాచారం.

మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ సమక్షంలో సింపుల్ గా జరగనున్న ఈ వేడుకలో వరుణ్, లావణ్య డిజైనర్ దుస్తుల్లో మెరవనున్నారని తెలుస్తోంది. ప్రముఖ డిజైనర్ తరుణ్ తాహిలియా డిజైన్ చేసిన దుస్తుల్లో వరుణ్ తేజ్ ముస్తాబవగా, లావణ్య కాస్ట్యూమ్స్ ని డిజైనర్ అనిత డోంగ్రే డిజైన్ చేశారట. అశ్విన్ మావ్లే స్టైలిస్ట్ గా వ్యవహరించనున్నాడు. మొత్తానికి, వరుణ్ లావణ్యల ఎంగేజ్మెంట్ డీటెయిల్స్ బయటకు రావటంతో మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం వరుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున’ సినిమాలో నటిస్తుండగా, ఈ సినిమా తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందనున్న VT13, పలాస దర్శకుడు కరుణ కుమార్ దర్శకత్వంలో VT 14 సినిమాలలో నటించనున్నాడు. లావణ్య త్రిపాఠి అధర్వ అనే తమిళ సినిమాతో పాటు పీపుల్స్ మీడియా సంస్థ నిర్మిస్తున్న మరో సినిమాలో నటిస్తోంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు