విజ‌య్ ‘బీస్ట్’ నెగెటివ్ టాక్‌కు కార‌ణం అదేనా..?

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ ద‌ళ‌ప‌తి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సినవ‌స‌రం లేదు. త‌మిళ భాషాతో పాటు తెలుగు, హిందీలోనూ విజ‌య్‌కి మాస్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. యాక్టింగ్ రాదు, డైలాగ్స్ చెప్ప‌లేడు అనే విమ‌ర్శ‌ల నుంచి పాన్ ఇండియా రేంజ్ హీరోగా ఎదిగాడు. విజ‌య్ చేసే సినిమాలు హిట్ అయినా.. ప్లాప్ అయినా.. చెక్కుచెద‌ర‌ని స్టార్ డ‌మ్ ను ద‌క్కించుకున్నాడు. విజ‌య్ సినిమాల‌కు ఎంత బ‌డ్జెట్ పెట్టినా.. సినిమాలు ప్లాప్ అయినా.. న‌ష్టాలు మాత్రం రావు అనే ట్రెండ్ కోలీవుడ్ లో ఉంది. దీంతో విజ‌య్ స్టార్ డ‌మ్ ను ఉప‌యోగించి సినిమాలు చేయాల‌ని డైరెక్ట‌ర్లు, ప్రొడ్యూస‌ర్లు పోటీ ప‌డుతుంటారు.

కాగ ద‌ళ‌ప‌తి విజ‌య్ తాజా గా ‘బీస్ట్’ అనే పాన్ ఇండియా సినిమా చేసిన విష‌యం తెలిసిందే. స‌న్ పిక్చ‌ర్స్ నిర్మించిన ఈ సినిమాను నెల్స‌న్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేశాడు. నెల్స‌న్ కొత్త డైరెక్ట‌ర్ అయినా.. గ‌తంలో వ‌చ్చిన ‘కొల‌మావు కోకిల‌’, ‘డాక్ట‌ర్’ పెద్ద హిట్ అందుకున్నాయి. ‘డాక్ట‌ర్’ అయితే.. ఏకంగా రూ. 100 కోట్ల మార్క్ ను అందుకుంది. దీంతో స‌న్ పిక్చ‌ర్స్ బీస్ట్ కోసం రూ. 150 కోట్ల భారీ బ‌డ్జెట్ పెట్టింది. ఏప్రిల్ 13న భారీ అంచ‌నాల‌తో రిలీజ్ అయిన ఈ మూవీ.. బీస్ట్ బిగ్ హిట్ కొట్ట‌డం ఖాయ‌మ‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ సినిమా తొలి రోజే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది.

విజ‌య్ ఫ్యాన్స్ కూడా బీస్ట్ తో హార్ట్ అయ్యారు. ఈ సినిమాలో యాక్ష‌న్ సీన్స్ అవ‌స‌రం లేని సంద‌ర్భంలోనూ ఉన్నాయి. అలాగే హీరోయిన్ పూజా హెగ్డే రోమాంటిక్ గా చూపించ‌లేకపోవ‌డంతో పాటు కేవ‌లం రెండు సాంగ్స్ కే ప‌రిమితం చేశారు. ముఖ్యంగా విజ‌య్ లాంటి స్టార్ హీరోకు దీటైన విల‌న్ ను కూడా ఎంచుకోవ‌డంలో విఫ‌లం అయ్యారు. స్టార్ కామెడియ‌న్ యోగి బాబును వినియోగంచుకోవ‌డంలోనూ త‌డ‌ప‌డ్డారు. దీంతో పాటు కేజీఎఫ్ చాప్ట‌ర్ – 2 లాంటి భారీ సినిమా ముందు రిలీజ్ చేయ‌డం చిత్ర బృందం బిగ్ మైన‌స్ అని చెప్ప‌వ‌చ్చు. కేజీఎఫ్ ముందు బీస్ట్ తెలిపోయింద‌ని ఒప్పుకోవాల్సిన నిజం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు