NBK108 : బాలయ్యకు జోడీగా టాలీవుడ్ చందమామ?

వీర సింహా రెడ్డి సూపర్ హిట్ తర్వాత నందమూరి నటసింహం బాలయ్య.. అనిల్ రావిపూడి తో సినిమా చేస్తున్న సంగతి విధితమే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి అధికారిక ప్రకటన రావడమే కాదు.. పూజా కార్యాక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభం కూడా అయింది. అలాగే ఇటీవల షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర గురించి ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా చర్చ సాగుతుంది.

ముందుగా ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ ప్రియాంక జూవాల్కర్ ను ఫిక్స్ చేసినట్టు వార్తలు వచ్చాయి. కానీ, అది రూమర్స్ అని తెలిపోయింది. తాజాగా ముగ్గురు హీరోయిన్ల పేర్లను చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో వీర సింహా రెడ్డి సినిమాలో బాలయ్యతో రొమాన్స్ చేసిన హనీ రోజ్ పేరు కూడా ఉందని టాక్ వచ్చింది.

అంతే కాదు.. హనీ రోజ్ నే ఫైనల్ చేసినట్టు కూడా వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర గురించి మరో హీరోయిన్ పేరు వినిపిస్తోంది. ఆమె ఎవరో కాదు.. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. పెళ్లి.. ప్రెగ్నెన్సీ తో కొంత గ్యాప్ తీసుకున్న కాజల్.. ప్రస్తుతం తిరిగి సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే.

- Advertisement -

కాజల్ ఇప్పటికే పలు సినిమాలకు కూడా సైన్ చేసింది. దీంతో ఇప్పుడు కాజల్ ను NBK108 సంప్రదిస్తున్నారట. ఈ చర్చలు సఫలం అయితే.. NBk108 లో బాలయ్య పక్కన కాజల్ ను చూడొచ్చు.

For More Updates :
Grab Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు