DEVADATTA NAGE: ఆది పురుష్ లో హనుమంతుడి పాత్రను వదులుకున్న టాలీవుడ్ స్టార్ హీరో!

హీరో ప్రభాస్ గురించి తెలియని వారు ఉండరు. అయితే ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పౌరాణిక చిత్రం ఆది పురుష్. ఈ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే టీజర్స్ తో పాటు ట్రైలర్ విడుదలై మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంటుంది. ఇక భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాకు తాజాగా సెన్సార్ పూర్తి అయ్యింది. ఈ సినిమాకు యు సర్టిఫికెట్ ను ఇచ్చింది సెన్సార్ బోర్డ్. అంతేకాదు టోటల్ రన్ టైం లాక్ అయ్యింది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.

ప్రస్తుతం ఆది పురుష్ లో ఆంజనేయుడు దేవదత్త నాగే పోషించిన విషయం తెలిసిందే. అయితే ఆయన కంటే ముందు హనుమంతుడి పాత్ర కోసం ఓం రౌత్ టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలను సంప్రదించారట. అందులో రానా ఒకరు. అయితే రానాకు హెల్త్ ప్రాబ్లం ఉండి డాక్టర్లు కొన్నాళ్లు షూటింగ్ చేయవద్దని రెస్ట్ లో ఉండాలని చెప్పారట. ఈ కారణంగానే రానా హనుమంతుడి పాత్ర చేయాలని ఉన్న సున్నితంగా నో చెప్పారట.

కాగా మరో వారం రోజుల్లో విడుదల కానున్న నేపథ్యంలో ప్రభాస్ విదేశాలకు వెళ్లిపోయారని తెలుస్తోంది. విదేశాల్లో ఆది పురుష్ విడుదల సందర్భంగా జరిగే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన వెళ్లినట్లు సమాచారం. ఇక ఈ సినిమా విడుదల తర్వాత ఆయన ఇండియాకు తిరిగి రానున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు