Urvashi Rautela : జోరు పెంచింది

ఊర్వశి రౌతేలా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె బాలీవుడ్ బ్యూటీ అయినప్పటికీ అన్ని భాషల వారికి సుపరిచితమే. మరి ముఖ్యంగా సోషల్ మీడియాను ఫాలో అయ్యే వారికి ఈమె పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకంటే ఇటీవలే కాలంలో ఈమె రిషబ్ పంత్ పై చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. దీంతో కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఇదిలా ఉండగా ఈమె టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది.

ఇప్పటికే రామ్ పోతినేని, బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో స్పెషల్ సాంగ్ చేస్తుంది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య లో కూడా ఐటెం సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సాంగ్ షూటింగ్ కూడా అయిపోయిందని టాక్. ఈ సినిమాను బాబి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ బాలీవుడ్ హాట్ బ్యూటీ తాజాగా మరో ఛాన్స్ ను దక్కించుకుందని సమాచారం.

నేచురల్ స్టార్ నాని హీరోగా ‘దసరా’ అనే మూవీ రాబోతుంది. ఓదెల శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ ఉందని తెలుస్తోంది. అయితే ఈ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా నటించబోతుందని పుకార్లు వినిపిస్తున్నాయి. మరి ఊర్వశి రౌతేలా-నాని కాంబినేషన్ లో సాంగ్ అంటే, అదిరిపోతుంది.

- Advertisement -

అందుకే ఈ రూమర్ వినిపించగానే అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొంది. సాయికుమార్, సముద్రఖనిలు కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు