Ustaad Bhagat Singh: సెకండ్ హీరోయిన్ గా మలయాళీ బ్యూటీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలకు సైన్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. దీన్ని హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు. వీరి కాంబినేషన్ లో ఇప్పటికే గబ్బర్ సింగ్ మూవీ వచ్చింది. గబ్బర్ సింగ్ రీమేక్ సినిమా, ఇప్పుడు రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా రీమేక్ సినిమా కావడం విశేషం. తమిళంలో విజయ్ దళపతి హీరోగా వచ్చిన తేరికి రీమేక్ గా ఈ ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుంది.

అయితే ఇటీవల ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుందని పుకార్లు వచ్చాయి. యంగ్ బ్యూటీ శ్రీలీల ఈ మధ్య ఫుల్ ఫామ్ లో ఉంది, పెద్ద హీరోలందరితో అవకాశాలు కొట్టేస్తుంది ఈ భామ. ఇటీవల రవితేజతో హిట్ అందుకుంది. తాజాగా ఇప్పుడు బాలకృష్ణ NBK108 సినిమా లో కూడా నటిస్తుంది.

తాజాగా ఈ సినిమా గురించి ఇంకొక వార్త బయటికి వచ్చింది, మలయాళీ భామ మాళవిక మోహన్ ఈ సినిమాలో రెండవ హీరోయిన్ గా చేయబోతోందని సమాచారం వచ్చింది. మాళవిక ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా లోను నటించలేదు. తన తొలి తెలుగు మూవీ ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో నటిస్తుంది.  ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్స్ కాగా, అందులో ఒకరుగా మాళవిక ఎంపిక అయినట్టు తెలుస్తోంది.

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ వరుసగా స్టార్ హీరోలతో ఛాన్స్ లను కొట్టేస్తోంది. ఇప్పటికే ప్రభాస్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్న మాళవిక, తాజాగా పవర్ స్టార్ పక్కన నటించే ఛాన్స్ ను కొట్టేసిందని టాక్. మరి మాళవిక-పవన్ జోడీ ఎలా ఉంటుందో చూడాలి మరి.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు