VBVK: ఆ హీరో చేతుల మీదుగా ట్రైలర్

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా తన టాలెంట్ తో ఇండస్ట్రీ లో అడుగు పెట్టాడు కిరణ్ అబ్బవరం. ఈ హీరో బ్యాక్ టు బ్యాక్ మంచి కాన్సెప్ట్ తో సినిమాలు చేస్తున్నప్పటికీ, ఏ సినిమా హిట్ అవ్వటంలేదు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా తానేంటో నిరూపించుకోడానికి ఎప్పటికప్పుడు మంచి మంచి కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తూనే ఉన్నాడు.

ఎస్.ఆర్.కల్యాణమండపం, సమ్మతమే, సెబాస్టిన్, రాజా వారు రాణి గారు వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో తాజాగా ”వినరో భాగ్యము విష్ణు కథ” అనే మరో సినిమా తో తెరకెక్కేందుకు సిద్ధం అవుతున్నాడు.

ఇటీవల ఈ సినిమాకు సంబందించిన టీజర్ రిలీజ్ అయింది.అయితే ఈ టీజర్ లో ఈ సినిమా ఒక థ్రిల్లర్ లా అనిపిస్తుంది. ఇప్పటి వరకు లవ్ స్టోరీస్ పైన ద్రుష్టి పెట్టిన ఈ హీరో ఇప్పుడు ఇంకో డిఫరెంట్ అంగెల్ లో కనిపించనున్నాడు.

- Advertisement -

ఈ సినిమా ఫిబ్రవరి 17వ తేదీన తెరకెక్కనుంది. ఈ ప్రమోషన్లలో భాగంగా సినిమా ట్రైలర్ లాంచ్ ను మెగా కుటుంబంలోని సాయి ధరమ్ తేజ్ చేతుల మీదుగా ఫిబ్రవరి 6వ తేదీన విడుదల చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయం పైన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఈ సినిమాతో అయినా కిరణ్ సబ్బవరం ఖాతా లో ఓ హిట్ పడనుందా లేదా అని వేచి చూడాల్సి ఉంది.

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు