Kushi : విజయ్ ముచ్చట తీరబోతుంది

విజయ్ దేవరకొండ టాలీవుడ్లో స్టార్ హీరోకి తక్కువ, మిడ్ రేంజ్ హీరోకి ఎక్కువ అన్నట్టు కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. ఓ పక్క రెండు పాన్ ఇండియా సినిమాలు(‘లైగర్’, ‘జన గణ మన’) వంటివి చేస్తూనే మరోపక్క శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఒక్క హిందీలో తప్ప సౌత్లోని అన్ని భాషల్లోనూ ఈ మూవీ డిసెంబర్ 23న విడుదల కాబోతుంది.

మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా ‘ఖుషి’ చిత్రంలో రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగానే ఉంటాయని తెలుస్తుంది. ముఖ్యంగా సమంత, విజయ్ దేవరకొండ ల మధ్య లిప్ లాక్ సన్నివేశాలు ఇంటిమేట్ సీన్లు కూడా ఉంటాయట. విజయ్ దేవరకొండ సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు మామూలే.

గతంలో ‘మహానటి’ చిత్రంలో విజయ్- సమంత లు కలిసి నటించారు. ఆ చిత్రంలో వీళ్ళ లవ్ ట్రాక్ సినిమాలో కొంత రిలీఫ్ గా అనిపించింది. కానీ వీళ్ళ మధ్య ఎటువంటి రొమాన్స్ ఉండదు. అయితే ‘సామ్ జామ్’ షోకి వచ్చినప్పుడు సమంతతో లిప్ లాక్ చేయలేదని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. అతని ముచ్చట ‘ఖుషి’ ద్వారా తీరబోతుందన్న మాట.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు