Vijay Deverakonda : ఫస్ట్ టైం పీరియాడికల్

లైగర్ డిసప్పాయింట్ మెంట్ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన సినిమాల పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. మరోసారి లైగర్ వంటి డిజాస్టార్ రావొద్దని ఈయన ప్రయత్నిస్తున్నారు. ఈ యంగ్ హీరో ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి అనే చిత్రంలో నటిస్తున్న సంగతి విధితమే. అయితే ఈ చిత్రంలోని కథానాయక అయిన సమంత మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడింది. దీంతో ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడింది. మళ్లీ తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందో క్లారిటీ లేదు.

దీంతో విజయ్ దేవరకొండ తాను తర్వాత చేసే సినిమాలపై దృష్టి పెట్టారు. అందుకు గౌతమ్ తిన్ననూరి, శేఖర్ కమ్ములతో కథలు వింటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ దర్శకులతో రౌడీ హీరో సినిమాలు ఉంటాయని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. ఇది ఇలా ఉండగా, విజయ్ దేవరకొండ తర్వాత సినిమాకు సంబంధించి ఒక ఆసక్తిరమైన వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

లవర్ బాయ్ గా పేరున్న విజయ్ దేవరకొండ ఒక పీరియాడికల్ సినిమా చేయబోతున్నారట. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటిస్తున్న వృషభ అనే చిత్రంలో విజయ్ దేవరకొండ ఒక కీలక పాత్ర చేస్తున్నారని టాక్. ఈ చిత్రంలో మోహన్ లాల్ కొడుకు పాత్ర కోసం మూవీ యూనిట్ రౌడీ హీరోను సంప్రదించారట. కథ నచ్చడంతో విజయ్ వెంటనే అంగీకరించారని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తుంది. కాగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సెట్స్ పైకి తీసుకెళ్లి, 2024లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు