Vijay Sethupathi : మరోసారి విలన్..

కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్, విక్రమ్ హిట్ తర్వాత ఫుల్ జోష్ లో ఉన్నారు. వరుసగా సినిమాలను ఒప్పుకుంటూ కొనసాగుతున్నారు. ఇప్పటికే మరుగున పడ్డ భారతీయుడు2 ను మరల పట్టాలెక్కించాడు. డైరెక్టర్ శంకర్ తో ఒక షెడ్యూల్ ను కూడా పూర్తి చేశాడు. శంకర్ దర్శకత్వంలో వస్తున్న మరో చిత్రం RC15 షూటింగ్ పూర్తి అయిన వెంటనే మరల భారతీయుడు2 ను సెట్స్ పైకి తీసుకెళ్లి తర్వాత షెడ్యూల్ ను ఫిక్స్ చేయనున్నారు. వీలనంత త్వరగా భారతీయుడు2ను పూర్తి చేయాలనే ప్లాన్ లో ఈ లోక నాయకుడు ఉన్నారు.

ఇదిఇలా ఉండగా కమల్ హాసన్ మరో సినిమా చేస్తున్నారు. హెచ్. వినోద్ దర్శకత్వంలో ఈ చిత్రం రాబోతుంది. దీన్ని రెడ్ జెయింట్ మూవీస్ పతాకం పై ఉదయనిధి స్టాలిన్ నిర్మించబోతున్నారు. ఈ చిత్రంపై అధికారిక ప్రకటన ఉదయనిధి స్టాలిన్ నే చేశాడని సంగతి విధితమే. ఈ చిత్రం KH233 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రీ పొడక్షన్ పనులు చేసుకునేందుకు సిద్ధమవుతోంది.

అయితే ఈ కొత్త చిత్రం గురించి ఒక ఆసక్తిరమైన వార్త కోలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రంలో కమల్ హాసన్ కు విలన్ గా విజయ్ సేతుపతి కనిపించబోతున్నారట. దీనికి సంబంధించిన చర్చలు ఇప్పటికే పూర్తి అయినట్టు సమాచారం. కాగా కమల్ హాసన్ నటిస్తున్న భారతీయుడు 2 లోనే విజయ్ సేతుపతి నటించాల్సి ఉందట. కానీ కొన్ని కారణాల వల్ల అది జరగకపోవడంతో KH233లో విజయ్ ని ఫిక్స్ చేశారని టాక్. సేతుపతి పాత్రపై త్వరలోనే మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రానుంది. ఇదే జరిగితే కమల్ కు విజయ్ రెండోసారి విలన్ గా చేస్తాడు. అలాగే భారతీయుడు2 తర్వాత KH233 చిత్రం రెగ్యూలర్ షూటింగ్ ఉండబోతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు