టీవీ 10-1 స్ట్రాటజీ ఏంటో.?

మీడియా
ఒకరిని శిఖరం మీద నిలబెట్టాలి అన్న
ఒకరిని పాతాళానికి తొక్కేయాలన్న కీలక పాత్రను పోషిస్తుంది.
వాస్తవంగా ఈ రోజుల్లో న్యూస్ ఛానెల్స్ లేవు,
ఎందుకంటే న్యూస్ మనకు ముందే తెల్సిపోతుంది.
మనకు తెలిసిన న్యూస్ ను న్యూసెన్స్ చేస్తూ మనలను ఎంటర్టైన్ చేస్తుంది ప్రస్తుతం ఉన్న మీడియా, సో ఇప్పుడు న్యూస్ ఛానెల్స్ కంటే ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ ఎక్కువ ఉన్నాయని గట్టిగా చెప్పొచ్చు.

ప్రతిసారి ఒక కొత్త సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉండటం,
ఆ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ జరిగే సమయంలో ఆ హీరోలను కొన్ని కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ వేసి, దానిని న్యూస్ గా మార్చి, దాని మీద డిబేట్స్ పెడుతూ, ఆయా ఛానెల్స్ రేటింగ్స్ లో కోసం చేసిన స్టంట్స్ మనకు తెలియంది కాదు.

రీసెంట్ గా విశ్వక్ సేన్ కి , ఒక ప్రముఖ ఛానల్ యాంకర్ కి మధ్య జరుగుతున్న పరిణామాలు ఏంటో, వాటి వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏంటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. “అశోక వనంలో అర్జున కళ్యాణం”
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చేసిన ఒక ప్రాంక్ వీడియో అనేక పరిణామాలకు దారి తీసింది. ఈ ప్రాంక్ వీడియో వలన పబ్లిక్ కి న్యూసెన్స్ జరిగినదంటూ ఒక ప్రముఖ ఛానల్ ఒక డిబేట్ ను నిర్వహించింది. నిర్వహించిన డిబేట్ లో వాడకూడని పదాలను వాడుతూ హీరో విశ్వక్ సేన్ గురించి ప్రస్తావించారు యాంకర్, వాటికీ బాధపడిన ఆ యంగ్ హీరో పొరపాటున ఒక సెన్సార్ వర్డ్ యూస్ చేసాడు.
అక్కడితో మొదలైన వివాదం ఇంకా ముదురుతూ వస్తుంది.

- Advertisement -

వాస్తవంగా చెప్పాలి అనుకుంటే ఇద్దరిలోను కొంతమేరకు తప్పులు ఉన్నాయ్ , ఒక పబ్లిక్ పోల్ నిర్వహిస్తే విశ్వక్ సేన్ కి ఎక్కువ సపోర్ట్ దక్కుతుంది కూడా, కానీ ఆ ప్రముఖ ఛానల్ ఏదైతే ఉందొ ఆమె తప్పుగా హీరో గురించి ప్రస్తావించిన వీడియోను పబ్లిక్ చేయకుండా, విశ్వక్ సేన్ ను పూర్తిగా తప్పు పట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఇక్కడితో అయిపోయింది అనుకుంటే పొరపాటే , ఈ ఇస్యూ ను మెల్లగా మహిళా సంఘాలకి కూడా జోడించారు, గోటితో జరిగిపోయే పనిని గొడ్డలితో జరిగేదాకా తీసుకురావడంలో ఈ ప్రముఖ ఛానెల్ స్ట్రాటజీ కేవలం టీఆర్పీనే అని చాలమంది అభిప్రాయం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు