Venkatesh: వెంకీ మామకి ‘జాతిరత్నం’ హిట్ ఇస్తాడా..?

గతంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలతో వరుస హిట్స్ అందుకొని ఫ్యామిలీ హీరోగా తన సత్తా చాటిన వెంకటేష్ ప్రస్తుతం ఆ రేంజ్ లో హిట్ లేక చాలా కాలంగా వెనకబడ్డాడనే చెప్పాలి. ఎఫ్2, ఎఫ్3 వంటి మల్టి స్టారర్ హిట్స్, ఆ మధ్య ఓటీటీలో హిట్ అయిన నారప్ప సినిమాలు మినహా ఈ మధ్య కాలంలో చెప్పుకోదగ్గ హిట్ లేదు. దీనికి తోడు రానా నాయుడు వెబ్ సిరీస్ తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమాలో ప్రాధాన్యత లేని క్యారెక్టర్ చేసి బాలీవుడ్ ఎంట్రీని వేస్ట్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో వెంకీ కాన్ఫిడెన్స్ కోల్పోయాడు కాబట్టే సింగిల్ హీరోగా సినిమాలు చేయడానికి బయపడుతున్నాడు అన్న విమర్శలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో జాతిరత్నాలు డైరెక్టర్ కేవీ అనుదీప్ దర్శకత్వంలో వెంకటేష్ సినిమా చేయనున్నాడన్న సమాచారం అందుతోంది.రానా నాయుడుతో వచ్చిన నెగిటివిటి నుండి బయటపడేలాగా క్లీన్ కామెడీ సినిమా చేయాలని వెంకటేష్ భావిస్తున్నాడట. ఈ మేరకు అనుదీప్ రెండు మూడు లైన్స్ కూడా వినిపించాడని, వాటిల్లో ఒకదానికి వెంకీ మామ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వస్తుందని సమాచారం.

ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో సైన్ధవ్ సినిమాలో నటిస్తున్న వెంకటేష్, ఈ సినిమాను డిసెంబర్ 22న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక అనుదీప్ సినిమాపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. మొత్తానికి ఆలస్యంగా అయినా వెంకటేష్ సరైన డైరెక్టర్ ని ఎంచుకున్నాడని చెప్పాలి. అనుదీప్ కలంలో ఉండే హిలేరియస్ కామెడీ టచ్ కి వెంకటేష్ టైమింగ్ తోడైతే థియేటర్లు నవ్వులతో దద్దరిల్లటం ఖాయం అని చెప్పవచ్చు. మరి, సరైన హిట్ లేక సతమతం అవుతున్న వెంకీ మామకి జాతిరత్నం హిట్ ఇస్తాడా లేదా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు