Harish Shankar : ఎదురుచూపులకు ఫలితం..

టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్.. అంటే గుర్తొచ్చే మరో పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. గత మూడేళ్ల నుంచి పవన్ తో సినిమా చేయడానికి ఎంతో ఆసక్తిగా చూస్తున్నాడు. రీమేక్ సినిమాలతో హీరోలకు సూపర్ హిట్ అందించే హరీష్ శంకర్ తన తర్వాత సినిమాను పవర్ స్టార్ తో తెరకెక్కిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ తో ఒక పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఒక పోస్టర్ తోనే సినిమాపై అంచనాలు భారీ స్థాయిలోకి వెళ్లాయి. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవర్ కళ్యాణ్ కూడా భవదీయుడు భగత్ సింగ్ ఉంటుందని స్పష్టం చేశాడు.

అయితే పవన్ రాజకీయ పనులు, ఇప్పటికే సైన్ చేసిన సినిమాల వల్ల హరీష్ శంకర్ వరకు పవన్ రాలేడు. దీంతో భవదీయుడు భగత్ సింగ్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. పవన్ కు స్టోరీ నచ్చలేదని అందుకే ఈ సినిమా రద్దు అయినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య వద్దకు తెరి రీమేక్ స్టోరీ వచ్చిందని సమాచారం. దీన్ని పవన్ కళ్యాణ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారని తెలుస్తుంది. ఈ స్టోరీని హరీష్ శంకర్ తీసుకుని తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా మార్పులు చేస్తున్నాడని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.

ఈ నెల 9న తెరి రీమేక్ స్టోరీని పవన్ కు వినిపించేందుకు హరీష్ శంకర్ రెడీ అవుతున్నాడని టాక్. ఇదిలా ఉండగా.. పవన్ తో సినిమా చేయాలని హరీష్ శంకర్ మూడేళ్ల నుంచి వెయిట్ చేస్తున్నాడు. గద్దలకొండ గణేష్ తర్వాత హరీష్ ఇంత వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. అలాంటి ప్రయత్నాలు కూడా పెద్దగా చేయలేదు. మూడేళ్ల ఎదురుచూపులకు ఫలితంగా తెరి రీమేక్ అయినా ఫైనల్ అవుతుందో లేదో తెలియాలంటే ఈ నెల 9వ వరకు ఫ్యాన్స్ కూడా ఎదురుచూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు