18 Pages: అనుపమ పై అల్లు అరవింద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం 18 పేజెస్. ఈ చిత్రానికి పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన లిరికల్ సాంగ్స్ యూట్యూబ్ లో ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ డిసెంబర్ 23న గ్రాండ్ గా థియేటర్లలో విడుదల అయ్యేందుకు రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఈ సినిమాలోని “ఏడురంగుల వాన” పాటను చిత్ర బృందం విడుదల చేసింది.

సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాటను నిర్మాత అల్లు అరవింద్ రిలీజ్ చేశారు. అనంతరం అల్లు అరవింద్ మాట్లాడుతూ.. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేశారు. ” అనుపమ గురించి నేను మీకు చెప్పకుండా ఉండలేకపోతున్నాను. నాకు అనుపమ పరమేశ్వర్ ని చూస్తే ఇలాంటి కూతురు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. ఆమె ఏది లోపల దాచుకోదు. ఆమె ఏది ఉంటే అది మొహం మీదే మాట్లాడుతుంది. ఇలాంటి అమ్మాయిలు మనకు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. తనలో ఎలాంటి నటన ఉండదు. చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. అందుకే నాకు అనుపమ అంటే చాలా ఇష్టం ” అని చెప్పుకొచ్చారు అల్లు అరవింద్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు