68 National Awards : జాతీయ స్థాయిలో టాలీవుడ్ సత్తా

తెలుగు చిత్ర పరిశ్రమ రోజు రోజుకు ఎదిగిపోతుంది. ఇప్పటికే బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలతో టాలీవుడ్ స్థానం ఉన్నత స్థాయికి చేరింది. తాజా గా 68వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో టాలవుడ్ సత్తా చాటింది. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం అవార్డ్ తో పాటు మొత్తం నాలుగు అవార్డులను గెలుచుకుంది. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా సుహాస్‌, చాందినీ చౌద‌రి న‌టించిన క‌ల‌ర్ ఫొటో ఎంపిక అయ్యింది.

జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎస్ ఎస్ థమన్ ఎంపికయ్యాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అలా వైకుంఠపురంలో సినిమాకు గాను థమన్ కు ఈ అవార్డు వచ్చింది. ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లు గా నటించిన విషయం తెలిసిందే. అలాగే మరో తెలుగు చిత్రం నాట్యం కూడా నేేషనల్ అవార్డులలో సత్తా చాటింది. ఈ సినిమా ఏకంగా రెండు అవార్డులను సొంతం చేసుకుంది. జాతీయ ఉత్త‌మ కొరియోగ్ర‌ఫీ విభాగంలో సంధ్యారాజు, జాతీయ ఉత్తమ మేకప్ విభాగంలో టీవీ రాంబాబు అవార్డులను గెలుచుకున్నారు.

ఈ అవార్డులలో టాలీవుడ్ తో పాటు సౌత్ సినిమా ఇండస్ట్రీలు కూడా రాణించాయి. సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన సూరారై పోట్రు తెలుగులో ఆకాశమే నీ హద్దురా సినిమా ఏకంగా నాలుగు అవార్డులను గెలుచుకుంది. అందరూ ఊహించినట్టు జాతీయ ఉత్తమ నటుడుగా సూర్య అవార్డు గెలుచుకున్నాడు. దీంతో పాటు బెస్ట్ ఫీచ‌ర్ ఫిల్మ్‌, జాతీయ ఉత్త‌మ న‌టిగా అప‌ర్ణ బాల‌ముర‌ళి, ఉత్త‌మ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ గా జీవీ ప్ర‌కాశ్ కుమార్ అవార్డులను సొంతం చేసుకున్నారు.

- Advertisement -

మలయాళం లోని అయ్యప్పనుమ్ కొషియుమ్ కూడా నాలుగు అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ డైరెక్టర్ గా సచీ ఎంపికయ్యాడు. అయ్యప్పనుమ్ కొషియుమ్ సినిమా తెరకెక్కించిన తర్వాత సచీ 2020 లో గుండె పోటుతో మరణించాడు. మరణానంతరం సచీకి జాతీయ అవార్డు వచ్చింది. అలాగే ఉత్తమ స‌హాయ న‌టుడుగా బిజూ మీన‌న్, బెస్ట్ ఫీ మేల్ ప్లేబ్యాక్ సింగ‌ర్ గా నాంచ‌మ్మ, బెస్ట్ స్టంట్ కొరియోగ్ర‌ఫీ కూడా అయ్యప్పనుమ్ కొషియుమ్ ఎంపికైంది.

68వ జాతీయ అవార్డులు గెలిచిన మొత్తం జాబితా :

ఉత్తమ చిత్రం : సూరారైపోట్రు

ఉత్తమ దర్శకుడు : కె.ఆర్. సచ్చిదానందన్ ( అయ్యప్పనుమ్ కోషియుమ్) (మరణానంతరం)

ఉత్తమ నటుడు : సూర్య (సూరారైపోట్రు), అజయ్ దేవ్ గన్ (తానాజీ)

ఉత్తమ నటి : అపర్ణ బాలమురళి (సూరారైపోట్రు)

ఉత్తమ స్క్రిన్ ప్లే : సూరారైపోట్రు

ఉత్తమ సంగీత దర్శకుడు : జీవీ ప్రకాష్ కుమార్

ఉత్తమ సంగీత దర్శకుడు తమన్ (అల వైకుంఠపురములో)

ఉత్తమ గీత రచయిత : సైనా (మనోజ్ మౌతషిర్)

ఉత్తమ సహాయ నటుడు : బిజూ మేనన్ (అయ్యప్పనుమ్ కోషియుమ్)

ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ : అయ్యప్పనుమ్ కోషియుమ్

బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ : నచికేట్ బర్వే మహేష్ షేర్లా (తానాజీ)

ఉత్తమ కొరియోగ్రఫీ : నాట్యం ( తెలుగు)

ఉత్తమ డాన్సర్ : సంధ్య రాజు (నాట్యం తెలుగు)

ఉత్తమ తెలుగు చిత్రం : కలర్ ఫోటో

ఉత్తమ హింది చిత్రం : తులసిదాస్ జూనియర్

ఉత్తమ కన్నడ చిత్రం : డొలు

ఉత్తమ మలయాళ చిత్రం : తింకలాఝా నిశ్చయం

ఉత్తమ తమిళ చిత్రం : శివరంజినియుమ్ ఇన్నుం సిల పెంగళుమ్

ఉత్తమ సహాయనటి : లక్ష్మీ ప్రియ చంద్రమౌళి (శివ రంజనీయం ఇన్నుమ్ సిలా పెంగళుమ్) (తమిళం)

ఉత్తమ బాల నటుడు : వరుణ్ బుద్దదేవ్ (తులసీదాస్ జూనియర్) స్పెషల్ మెన్షన్

మోస్ట్ ఫిలిం ఫ్రెండ్లీ స్టేట్ : మధ్య ప్రదేశ్

ఉత్తయ వాయిస్ ఓవర్ శోభా రాప్సోడి ఆఫ్ రెయిన్స్ – మాన్సూన్ ఆఫ్ కేరళ (ఇంగ్లీష్)

ఉత్తమ సంగీత దర్శకుడు: విశాల్ భరద్వాజ్ (1232 కి.మీ మరేంగే తో వహీన్ జాకర్) (హిందీ)

ఉత్తమ ఎడిటింగ్ : అనాదీ అతలే (బార్డర్ ల్యాండ్స్ )

ఉత్తమ సినిమాటోగ్రఫీ నిఖిల్ ఎస్. ప్రవీణ్ (శబ్దికున్ కలప్ప) (మలయాళం)

ఉత్తమ కుటుం కథా చిత్రం : కుంకుమార్చన్ (మరాఠీ)

ఉత్తమ షార్ట్ ఫిక్షన్ ఫిలిం : కచీచినుతు (అస్సాం)

స్పెషల్ జ్యూరీ అవార్డ్ : అడ్మిటెడ్ (హిందీ ఇంగ్లీష్)

ఉత్తమ పరిశోధనాత్మక చిత్రం : ద సేవియర్ : డ్రిగేడియర్ ప్రీతమ్ సింగ్ (పంజాబీ)

బెస్ట్ ఎక్స్ ప్లోరేషన్ మూవీ : వీలింగ్ ద బాల్ ( ఇంగ్లీష్ హిందీ)

ఉత్తమ ఎడ్యుకేషనల్ ఫిలిం : డ్రీమింగ్ ఆఫ్ వర్డ్స్ (మలయాళం)

ఉత్తమ ఫిలిం ఆన్ సోషల్ ఇష్యూస్ జస్టిస్ డిలేయ్డ్ బట్ డెలివర్డ్ (హిందీ) 3 సిస్టర్స్ (బెంగాలీ)

ఉత్తమ ఎన్వైర్ మెంట్ ఫిలిం : మాన అరు మానుహ్ (అస్సామీస్ )

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు