Dil Raju : సినిమాను తలపించే లవ్ స్టోరీ

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. హీరోలకు సమానమైన క్రేజ్ ని దక్కించుకున్న అతికొద్దిమంది నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. ఈ ఏడాది సంక్రాంతి బరిలో చిరంజీవి, బాలకృష్ణ వంటి వారితో కూడా సై అంటే సై అంటూ పోటీపడి ఎట్టకేలకు వారసుడు సినిమాని వాయిదా వేసుకున్నారు. జనవరి 14న విడుదలైన దిల్ రాజు నిర్మించిన వారసుడు సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్ గా దూసుకుపోతుంది.

ఇదిలా ఉంటే.. దిల్ రాజు వ్యక్తిగత విషయాల గురించి కూడా మనకి తెలిసిందే. ఆయన మొదటి భార్య అనిత గుండెపోటుతో 2017లో మరణించారు. ఆ తరువాత మూడేళ్లపాటు ఒంటరి జీవితాన్ని గడిపిన దిల్ రాజు 2020లో తేజస్వినిని రెండవ వివాహం చేసుకున్నారు. ఇక ఎప్పుడూ సినిమాల గురించే మాట్లాడే దిల్ రాజు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన రెండవ భార్య తేజస్విని కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి వివాహానికి సంబంధించిన విషయాలను పంచుకోవడంతో అవి ఇప్పుడు వైరల్ గా మారాయి.

“నా మొదటి భార్య అనిత మరణించిన తర్వాత రెండేళ్లు చాలా కష్టాన్ని అనుభవించాను. నేను అప్పటికి 47 ఏళ్లు ఉంటాను. జీవితంలో ముందుకు వెళ్లాలి అనుకున్నప్పుడు రెండు మూడు ఆప్షన్లు కనిపించాయి. కానీ నేను ఒక సెలబ్రిటీని. నన్ను అర్థం చేసుకునేవాళ్లు జీవితంలో ఉంటే బాగుంటుంది. లేదంటే ఇంకా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనుకున్న. ఆ సమయంలోనే తేజస్విని కలిసింది. ఓ సారి విమానంలో ప్రయాణం చేసే సమయంలో తేజస్విని పరిచయం అయింది. ఆమె ఫోన్ నెంబర్ తీసుకున్నా..” అని చెప్పాడు.

- Advertisement -

అలాగే “సంవత్సరం పాటు ఆమెను అబ్జర్వ్ చేశా. ఆ తరువాత ఆమెకు ప్రపోజ్ చేసి ఇంట్లో వాళ్లని ఒప్పించా” అని చెప్పుకొచ్చారు దిల్ రాజు. అలాగే తేజస్విని కూడా దిల్ రాజు తనకు ఎలా పరిచయమయ్యారు అనే విషయాన్ని వెల్లడిస్తూ.. “నేను ఎయిర్లైన్స్ లో పనిచేస్తున్నప్పుడు రెగ్యులర్ గా ఈయన ట్రావెల్ చేసేవారు. మొదటిసారి నన్ను కలిసినప్పుడు పెన్ అడిగారు. నేను షిఫ్ట్ లో ఉన్న ప్రతిసారి విమానంలో కనిపించేవారు. అలా మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది” అని చెప్పుకొచ్చారు. ఈ లవ్ స్టోరీ విన్న నెటిజన్లు.. “ఈ స్టోరీతో సినిమా తీయవచ్చని”, “పెన్ తో మొదలైన వీరి ప్రయాణం చివరికి పెళ్లి వరకు వచ్చింది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు