Das Ka Dhamki : రొమాంటిక్ సాంగ్ అవుట్

విశ్వాక్ సేన్.. సినీ నటుడు గానే కాకుండా దర్శకుడిగా, స్క్రీన్ ప్లే రచయితగా కూడా మంచి గుర్తింపు పొందాడు. ఇక ఈయన అతి తక్కువ సమయంలోనే మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. 2017లో వెళ్ళిపోమాకే సినిమాతో తొలిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఫలక్నామా దాస్ సినిమాతో పెద్ద స్టార్ అయిపోయాడు విశ్వక్సేన్. తన నటనతో ఎక్కడా తగ్గకుండా కుమ్మేశాడు.

ఈ సినిమాతో యూత్ లో మంచి గుర్తింపును తెచ్చుకున్న విశ్వక్సేన్ వరుస సినిమాలలో నటిస్తూ అదరగొడుతున్నాడు. ఇక ప్రస్తుతం విశ్వక్ సేన్ దమ్కీ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీలో విశ్వక్ సేను హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీకి దర్శకత్వం కూడా వహిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా దమ్కీ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్ డేట్ ను విడుదల చేసింది. తాజాగా మేకర్స్ రెండో సింగిల్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. “ఆల్ మోస్ట్ పడిపోయిందే పిల్ల” అంటూ సాగే వీడియో సాంగ్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది.

- Advertisement -

ఈ పాటకు లియాన్ జేమ్స్ మ్యూజిక్ అందించగా, ఆదిత్య ఆర్కే సింగర్ గా వ్యవహరించారు. ఇక ఇందులో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు, హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సీన్స్, స్టెప్పులు అదిరిపోయాయి. మొత్తానికి ఇవాళ రిలీజ్ చేసిన ఈ సాంగ్, హిట్ ట్రాక్ అని చెప్పొచ్చు. కాగా, ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 తెలుగు సహా తమిళ్, మళయాళం మరియు హిందీలో కూడా రిలీజ్ కాబోతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు