Hero Aadi Saikumar : టాప్ గేర్ లో వచ్చేస్తున్నాడు..

“ప్రేమ కావాలి” సినిమాతో హీరోగా పరిచయమైన ఆది సాయికుమార్ “లవ్లీ”, “సుకుమారుడు” వంటి చిత్రాలతో అలరించాడు. జయపజయాలను పట్టించుకోకుండా వరుస సినిమాలతో ముందుకు పోతున్నాడు అది. ప్రస్తుతం ఈయన క్రేజ్ ఎలా ఉన్నా.. సినిమాలను మాత్రం వరుస పెట్టి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఆది సాయి కుమార్ ఇప్పటికే 6 సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో ఒకటి ” టాప్ గేర్”. ఇటీవల విడుదల చేసిన ఈ మూవీ టైటిల్ లోగోకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి మరో అప్డేట్ ని అందించింది మూవీ యూనిట్. ఈ చిత్రంలో ఆది సరికొత్త పాయింట్ తో అలరించబోతున్నాడని తెలుస్తోంది. ఈ మోషన్ పోస్టర్ ద్వారా టాప్ గేర్ సినిమాలో ఆది క్యాబ్ డ్రైవర్ గా కనిపించనున్నాడని తెలుస్తుంది. చేతిలో నుండి బ్యాగులు మారడం, ఆపై కాల్పులు జరపడం వంటివి మోషన్ పోస్టర్ లో కనిపించాయి. ఇవి సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

శశికాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఇటీవలే షూటింగ్ ప్రారంభించారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆదిత్య మూవీస్, శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై కే.వీ శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఆదికి జోడిగా రియా సుమన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీలో బ్రహ్మాజీ కీలకపాత్రలో నటిస్తున్నాడు. అలాగే సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్ర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూర్చుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు