Prabhas: ఆదిపురుష్ స్ట్రోమ్ కి ఇంకా 100 రోజులే…

ఆదిపురుష్ సినిమా రామయాణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కబోతున్న భారతీయ పౌరాణిక చిత్రం. ఈ చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఓం రౌత్ ఇప్పటికే తన్హాజ్ వంటి పీరియాడిక్ సినిమాలు చేశాడు. దీంతో ఆదిపురుష్ ను హ్యాండిల్ చేయడం పెద్ద కష్టమేమి కాదు. ఆదిపురుష్ సినిమాను ఆగష్టు 2020 లో ప్రకటించారు. ఈ సినిమా లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో గా, బాలీవుడ్ భామ కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

ఈ సినిమాలో రాఘవ రామునిగా ప్రభాస్ నటించగా జానకి దేవిగా కృతి సనన్ నటించింది. ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది. కానీ అనివార్య కారణాల చేత వాయిదా పడుతూ వస్తోంది. అలాగే ఈ సినిమా నుంచి అప్డేట్స్ కూడా ఎక్కువగా రాలేదు. ఇటీవల ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. కానీ, ఈ టీజర్ కు ప్రభాస్ అభిమానుల నుంచే వ్యతిరకత వచ్చింది. దీనికి కారణం.. సినిమాలో ఉపయోగించిన వీఎఫ్ఎక్స్ వర్క్స్.

దీంతో వీఎఫ్ఎక్స్ పనుల్లో లోపం ఉందని మూవీ టీం కూడా గ్రహించి, వాటిని చక్కదిద్దే పనుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో సినిమా వాయిదా పడుతుంది. కాగా ఈ సినిమా రిలీజ్ డేట్ మూవీ టీం ఇప్పటికే విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్ 16న సినిమాను విడుదల చేస్తామని ఆదిపురుష్ టీం ప్రకటించింది.

- Advertisement -

అంటే.. రాఘవ రాముడి రాకాకు.. నేటి నుంచి 100 రోజులు మాత్రమే ఉంది. ఇదే విషయాన్ని డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదిక కామెంట్ చేస్తున్నారు. ట్విట్టర్ లో #AdipurushStormIn100Days అనే హ్యాష్ ట్యాగ్ తో హాల్ చల్ చేస్తున్నారు. ఇంకో 100 రోజుల్లో రాబోయే ఆదిపురుష్ సినిమా ఎలాంటి రికార్డ్ లను క్రియేట్ చేస్తుందో.. వేచి చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు