అప్పుల్లో ఆచార్య.. తిప్ప‌ల్లో మెగాస్టార్

దేశానికి క‌రోనా మ‌హమ్మారి ఏ ముహుర్తాన వ‌చ్చిందో గాని.. ప్ర‌తి ఒక్క‌రు స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నారు. పెద కుటుంబాల‌ నుంచి పెద్ద కుటుంబాల వ‌ర‌కు ఎదో ఒక ర‌కంగా క‌రోనా వైర‌స్ తో బాధ‌లు ప‌డ్డారు. దీనికి సినిమా రంగం కూడా అతీతం కాదు. అయితే ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారి శాంతించినా.. దాని ఇండ‌స్ట్రీపై ప్ర‌భావాలు ఇప్పుడు క‌నిపిస్తున్నాయి. క‌రోనా వైర‌స్ ముందు షెడ్యూల్ ప్ర‌కారం.. భారీగా సెట్స్ వేయ‌డం తో పాటు ఇత‌ర నిర్మాణ ప‌నులు చేశారు. కానీ క‌రోనా వైర‌స్ వ‌ల్ల షూటింగ్స్ అన్ని వాయిదా ప‌డ్డాయి. దీంతో నిర్మాత‌లు భారీగా న‌ష్ట‌పోయారు.

ఈ విష‌యాన్ని తాజా గా మెగా స్టార్ చిరంజీవి కూడా ఒక ఇంట‌ర్వ్యూలో ప్ర‌స్తావించాడు. క‌రోనా మ‌హమ్మారి వ‌ల్ల‌ అన్ని పెద్ద సినిమాలకు బడ్జెట్ సమస్యలు ఎదురయ్యాయని అన్నారు. ఒక్కో సినిమా కోసం నిర్మాతలు అప్పులు చేయ‌డం వ‌ల్ల.. దాదాపు రూ. 50 కోట్లు వ‌డ్డీ చెల్లిస్తున్నార‌ని తెలిపారు. ఆచార్యకు కూడా అదే స్థాయిలో వ‌డ్డీలు ఉన్నాయ‌ని అన్నారు. తాను, రామ్ చ‌ర‌ణ్ ఆచార్య కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డా.. ఇప్ప‌టి వ‌ర‌కు రెమ్యూన‌రేష‌న్ తీసుకోలేద‌ని అన్నారు. ఇలాంటి గందరగోళ ప‌రిస్థితుల్లో టికెట్ల ధ‌ర‌ల‌ను పెంచుకోవ‌డానికి ప్ర‌భుత్వాల‌ను నిర్మాత‌లు కోరుతున్నార‌ని వివ‌రించారు.

కాగ ఈ నెల 29న విడుద‌ల కాబోతున్న‌ ఆచార్య సినిమాకు తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు.. టికెట్ల ధ‌ర‌ల‌ను పెంచుకోవ‌డానికి అనుమ‌తులు ఇచ్చిన విష‌యం తెలిసిందే. దీని వ‌ల్ల ఆచార్యకు లాభాలు వ‌స్తాయో లేదో చూడాలి మ‌రి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు