Acharya : ‘ఆచార్య’- మహేష్- వి.ఎఫ్.ఎక్స్ ల అసలు కథ..!

‘ఆచార్య’ చిత్రం ఏప్రిల్ 29న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ టాక్ ను మూటకట్టుకుంది. ఈ మూవీ చిరంజీవి వి.ఎఫ్.ఎక్స్ షాట్స్ అయితే ఓ 10 ఏళ్లకు సరిపడా ట్రోలింగ్ స్టఫ్ లా అనిపించింది. మే 20న ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ రిలీజ్ చేశారు.

ఇక్కడ పరిస్థితి మరింత ఘోరం అని చెప్పాలి. ఈ చిత్రాన్ని చూసిన వాళ్ళు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో ఆ వి.ఎఫ్.ఎక్స్ షాట్ కు అలాగే మహేష్ బాబుకి ఉన్న లింక్ గురించి ఓ వార్త బయటకి వచ్చింది.

నిజానికి ‘ఆచార్య’ సినిమాలో మహేష్ ను 15 నిమిషాల పాత్రకి అనుకున్నారట. ఇక చిరంజీవి యంగ్ లుక్ కోసం రాంచరణ్ ను అనుకున్నారట. సత్యదేవ్ పాత్ర మరణించేప్పుడు యంగ్ ‘ఆచార్య’ గా చరణ్ వచ్చినట్టు ఉంటుంది. కానీ ఆ 15 నిమిషాల పాత్రకి మహేష్ వెంటనే ఒప్పుకోలేదు. నిజానికి అతనికి చేయడం కూడా ఇష్టం లేదు. కొరటాలకి ఈ విషయం నేరుగా చెప్పడానికి టైం తీసుకున్నాడు.

- Advertisement -

ఇంతలో నిర్మాతలు ఆ 15 నిమిషాలు పాత్ర కోసం మహేష్ కు రూ.30 కోట్లు ఆఫర్ చేశారట. దీంతో ఆ పాత్రకి చరణ్ ను పెట్టేసుకుందాం అని 15 నిముషాలు లెంగ్త్ కలిగిన ఆ పాత్రని 45 నిమిషాల పెంచేసారట చిరు . దీంతో యంగ్ చిరు పాత్రకి వి.ఎఫ్.ఎక్స్ ను వాడి మేనేజ్ చేద్దాం అనుకున్నారు. కానీ అదే మైనస్ అయిపోయింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు