Prabhas: రికార్డు రేటు ఓకే. కానీ టికెట్ రేటు?

పాన్ ఇండియన్ మూవీ గా రాబోతున్న “ఆదిపురుష్” రోజు రోజుకి అంచనాలను పెంచేస్తుంది. బాలీవుడ్ మూవీగానే వస్తున్న ఈ సినిమా భారీ మైథలాజికల్ మూవీగా 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిందని తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించారు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ టీజర్ తో వచ్చిన విమర్శలను, అనుమానాలను ట్రైలర్ తో పూర్తిగా పోగొట్టేసాడు. ఇప్పటికే తమ ప్రమోషన్స్ తో సినిమాపై ఉన్న అంచనాలను పీక్స్ కి తీసుకెళ్లారు.

ఇక ఆదిపురుష్ యొక్క తెలుగురాష్ట్రాల రైట్స్ ను రీసెంట్ గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు సొంతం చేసుకున్నారని సమాచారం. అయితే తెలుగు రాష్ట్రాల రేటును 170 కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించి రికార్డు రేటుకుకొన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే RRR సినిమా తర్వాత ఎక్కువ రేటుకు అమ్ముడైన సినిమా ఇదే అవుతుంది.

అయితే ఆదిపురుష్ పై ఆడియన్స్ కి మరో అనుమానం వచ్చి పడింది. రికార్డు రేటుకి ఈ సినిమా అమ్ముడు పోయింది అని అంటున్నారు. మరి ఆ అంత పెద్ద మొత్తం రికవరీ అవ్వాలంటే టికెట్ రేటు కూడా ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు సామాన్య ప్రజలు ఈ సినిమాను చూడగలరా అన్న అనుమానం ట్రేడ్ పండితుల్లో వస్తుంది. ఎందుకంటే గతంలో RRR ను అనుకరించి ఆచార్య, సర్కారు వారి పాట, రాధేశ్యామ్ లాంటి సినిమాలకు అధిక రేటుకు టిక్కెట్లను విక్రయించి డిస్ట్రిబ్యూటర్లు దెబ్బతిన్నారు.

- Advertisement -

యావరేజ్ గా ఉండే సర్కారు వారి పాట మొదటి వారం తర్వాత ఒక్క షో కూడా హౌస్ ఫుల్ పడక చేతులెత్తేసింది. ప్రస్తుతం సింగల్ స్క్రీన్ లలో 150 మల్టీప్లెక్స్ లో 200 నుంచి 300 వరకు ఉన్న రేటు, గతంలో మాదిరిగా 210 నుంచి 450 కి పెంచితే లాంగ్ రన్ ఆడే అవకాశాన్ని కోల్పోతుంది. అందువల్ల డిస్ట్రిబ్యూటర్లు కొంచెం అలోచించి సామాన్యులకి అందుబాటులో సినిమా టికెట్ రేట్లను నిర్ణయిస్తే మంచిదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు