Adivi Sesh : అడవి శేష్ దారుణంగా మోసపోయాడట..!

సినిమాల్లో స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత ఎవరు ఏం చేసినా పట్టించుకోరు.. కానీ సాధారణ నటీనటులుగా ఉన్నప్పుడు ఎవరు ఏం చేసినా పట్టించుకోకుండా ఉండడమే బెటర్ అని పరిశ్రమలో అందరూ అంటుంటారు. ఇక్కడ మోసపోవడం అనేది చాలా చిన్న విషయం. ఇలాంటి ఎన్నో గొప్ప పాఠాలు నేర్చుకోకపోతే ఇండస్ట్రీలో ఎదగడం కష్టం.కెరీర్ ప్రారంభంలో హీరో అడివి శేష్ కూడా అలానే మోసపోయాడట.

అడివిశేష్ మాట్లాడుతూ.. “నాకప్పుడు 15 ఏళ్లు. ‘చందమామ’ సినిమాలో నాకు ఆఫర్ వచ్చింది. నవదీప్ చేసిన పాత్రను నన్నే చేయమన్నారు. 2 రోజులు షూటింగ్ కూడా చేశాను. కానీ అంతలోనే ఆ సినిమా ఆగిపోయింది. అదే టైమ్ లో ‘సొంతం’ సినిమాలో ఆఫర్ వచ్చింది. ఇందులో ఓ కీలక పాత్ర ఉంది, మంచి పేరొస్తుంది చేస్తావా అని నన్ను అడిగారు. నాకు చిన్నపాటి నెరేషన్ కూడా ఇచ్చారు. నేను ఓకే చెప్పాను. ‘సొంతం’ సినిమాలో నా పోర్షన్ షూటింగ్ 3 రోజుల్లో పూర్తయిపోయింది.

కీలక పాత్ర అని చెప్పి 3 రోజుల్లో పూర్తిచేశారేంటా అని నాకు అప్పుడే అనుమానం వచ్చింది. కట్ చేస్తే, ‘సొంతం’ సినిమా విడుదలైన తర్వాత అసలు విషయం అర్థమైంది. సినిమాలో నా పాత్ర కొన్ని సెకండ్లు మాత్రమే ఉంటుందని. నేను మోసపోయాను అనే విషయం అప్పుడు కన్ఫర్మ్ అయ్యింది.మళ్ళీ యూఎస్ వెళ్లిపోయాను.”

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు