Hit 2 : ముందే ఊహించాం

టాలీవుడ్ టాలెంటేడ్ యాక్ట‌ర్ అడివి శేష్ లేటెస్ట్ మూవీ హిట్ 2 డిసెంబ‌ర్ 2న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.  శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో నాని స‌మ‌ర్ప‌కుడిగా వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్ పై ప్ర‌శాంతి త్రిపుర‌నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌద‌రి హీరోయిన్ గా న‌టిస్తోంది. ప్రస్తుతం సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ వర్క్ శరవేగంగా జ‌రుగుతోంది.

ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అతి త‌క్కువ వ్య‌వ‌ధిలోనే యూట్యూబ్ స‌హా అన్నీ సోష‌ల్ మీడియా మాధ్య‌మాల్లో హిట్ 2 టీజ‌ర్ హ‌ల్ చ‌ల్ చేస్తూ ట్రెండ్ అయింది. టీజ‌ర్‌తో సినిమాపై ఉన్న అంచనాల‌ను రెట్టింపు అయ్యాయి. అయితే తాజాగా హిట్ 2 టీంకు యూట్యూబ్ షాక్ ఇచ్చింది. యూట్యూబ్ హిట్ 2 టీజ‌ర్‌ ను ట్రెండింగ్ లిస్ట్ నుంచి తొల‌గించారు.

టీజ‌ర్ చూడ‌డానికి వ‌యోప‌రిమితి ఉండాలంటూ ఆంక్ష‌ల‌ను విధించింది. టీజర్ ఓపెన్ చేస్తే సైన్ ఇన్ చేయాలని చూపిస్తుంది. సైన్ ఇన్ చేస్తేనే ఈ వీడియో చూడొచ్చు. టీజ‌ర్ పై యూట్యూబ్ యాక్ష‌న్ తీసుకునే లోపు 9 మిలియ‌న్ వ్యూస్ వ‌చ్చాయి. దీనిపై హీరో అడివి శేష్ వివ‌ర‌ణ ఇస్తూ.. ఓ వీడియోను విడుద‌ల చేశారు.

- Advertisement -

అస‌లు ఏం జ‌రిగింద‌నే విష‌యాన్ని వివ‌రిస్తూనే టీజ‌ర్ ని చూడాల‌నుకుంటే ఏం చేయాలో చెప్పారు. ఇలాంటిది ముందే జ‌రుగుతుంద‌ని టీమ్ ముందుగానే ఊహించింది. ఇక అంతా స‌వ్యంగానే జ‌రుగుతుంద‌ని చిత్ర యూనిట్ భావిస్తోంది. యూట్యూబ్ నిర్ణ‌యాన్ని చిత్ర యూనిట్ స్వాగ‌తించింది. అదేవిధంగా త‌న వీడియోలో రేపు విడుద‌ల‌వుతున్న ఉరికే ఉరికే సాంగ్‌ని చూసి ఎంజాయ్ చేయాల‌ని కోరారు. ఆ సాంగ్‌కి సంబంధించిన ప్రోమో కూడా విడుద‌ల‌ అయింది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు