Kangana: నాపై కూడా యాసిడ్ దాడి చేస్తారని భయపడ్డా

దేశ రాజధాని ఢిల్లీలో ఓ దారుణ సంఘటన చోటు చేసుకుంది. నైరుతి ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో 17 అమ్మాయి, 13 ఏళ్ల వయసు ఉన్న అక్క చెల్లెలు నివాసం ఉంటున్నారు. వారు ఢిల్లీలోని ఓ స్కూల్లో చదువుకుంటున్నారు. వారు ఇంటి నుంచి ఒకేసారి బయలుదేరి స్కూల్ కి వెళుతున్న క్రమంలో అక్క మీద కిరాతకులు యాసిడ్ పోయడం కలకలం రేపింది. యాసిడ్ దాడికి గురైన 17 ఏళ్ల అమ్మాయి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై బాలీవుడ్ హీరోయిన్ కంగనా రణౌత్ స్పందించింది. గతంలో తన చెల్లెలిపై జరిగిన యాక్సిడెంట్ దాడిని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకుంది. ఆ సమయంలో తన మానసిక పరిస్థితి ఎలా ఉందో గుర్తు చేసుకొని.. ఆ దాడిలో ఆమె ఏం కోల్పోయిందో, సమాజం పట్ల ఎలా ఉండాలో నేర్చుకున్నానని తెలిపింది.
తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ ని కూడా షేర్ చేసింది. ఈ స్టోరీలో ఆమె.. ” యాసిడ్ దాడిలో మా సోదరి మొహం సగం కాలిపోయింది. ఓ కన్ను చూపు కూడా కోల్పోయింది. చెవి పూర్తిగా కాలిపోయింది. రెండు నుంచి మూడు ఏళ్లలోనే 52 సర్జరీలు అయ్యాయి. ఆమె పెళ్లి సంబంధం కూడా రద్దు అయింది. దీంతో మానసికంగా కృంగిపోయింది. ఎవరితోనూ మాట్లాడేది కాదు. అప్పుడు మా అక్కని చూసి తట్టుకోలేకపోయాను. యోగాతో ఆమె మళ్ళీ మామూలు మనిషి అయింది. అయితే ఇప్పటికీ ఆ చేదు జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉంటాయి. ఎవరైనా తెలియని వ్యక్తులు నా పక్కనుంచి వెళ్తే తీవ్రంగా భయపడతాను. ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి” అని కంగనా ఇంస్టా వేదికగా కోరింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు