Honey Rose : ఫోకస్ మొత్తం టాలీవుడ్ పైనే

కొంత మంది నటీనటులకు అనూహ్యంగా విపరీతమైన క్రేజ్ వస్తోంది. వాళ్లు చాలా ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా.. రాని గుర్తింపు కేవలం ఒకే ఒక్క సినిమాతో వచ్చేస్తోంది. దీంతో వారి కెరీర్ ఒక్కసారిగా మారిపోతుంది. ఫ్యాన్స్ బేస్ పెరిగిపోతుంది. ఫాలోవర్స్ పెరిగిపోతారు. మొత్తంగా లైఫ్ స్టైల్ మారిపోతుంది.

ఇలాంటి పరిస్థితి ప్రస్తుతం మలయాళ బ్యూటీ హనీ రోజ్ కి వచ్చింది. ఈ హాట్ బ్యూటీ ఇటీవల నందమూరి బాలయ్య నటించిన వీర సింహా రెడ్డిలో కీలక పాత్ర చేసింది. ఈ సినిమాలో మొదటి పార్ట్ లో మెరిసిన జుట్టుతో కనిపించిన ఈ భామ, సెకండాఫ్ లో కుర్రకారు మనసులను దోచుకునేలా కనిపించింది. నిజానికి సినిమా రిలీజ్ కు ముందే వచ్చిన మా బావ మనోభావాలు సాంగ్ లో, ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో ఈ భామ అందరి కంట పడింది.

ఇక సినిమా రిలీజ్ అయ్యాకా.. ఈమె అందానికి యూత్ ఫిదా అయిపోయింది. వీర సింహా రెడ్డిలో హీరోయిన్ శ్రుతి హాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్ కంటే ఎక్కువ గుర్తింపు, క్రేజ్ హనీ రోజ్ కే వచ్చిందని చెప్పడంలో ఎలాంటి అనుమానాలు లేవు. అయితే హనీ రోజ్ కు ఇదే తొలి తెలుగు సినిమా కాదు. 2008, 2014 లలో ఆలయం, ఈ వర్షం సాక్షిగా వంటి తెలుగు సినిమాల్లో కనిపించింది. కానీ, అప్పుడు ఇలాంటి గుర్తింపు రాలేదు.

- Advertisement -

కానీ, ఇప్పుడు వీర సింహా రెడ్డితో తెలుగులో కావాల్సినంత గుర్తింపు వచ్చింది. దీంతో ఈ భామకు తెలుగు అవకాశాలు రావడం పెద్ద కష్టమేమీ కాదు. ఇప్పటికే బాలయ్య నుంచి త్వరలో రాబోతున్న NBK108 కు హీరోయిన్ గా హనీ రోజ్ ను పరిశీలిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇది నిజం అవుతుందో.. లేదో తెలియదు.. కానీ, ప్రస్తుతం సీనియర్ హీరోలకు సరైన జోడీ దొరకడం కష్టంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో హనీ రోజ్ కు తెలుగులో అవకాశాలు రావడం ఈజీ అనే చెప్పొచ్చు.

దీంతో హనీ రోజ్ కూడా తెలుగులో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత సమయంలో ఈమె మలయాళం కంటే, టాలీవుడ్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టిందని టాక్ వినిపిస్తోంది.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు