Agent : అంతా సజావుగానే ఉంది.

ఇండస్ట్రీ లో వేగంగా ప్రయాణించేవి ఏంటి అంటే రూమర్స్ అని చెప్పొచ్చు. సినిమా ఇండస్ట్రీలో రూమర్స్ చాలా కామన్.
ఈ పుకార్ల వల్ల సినిమాలకు నష్టం జరగవచ్చు.లాభం జరగవచ్చు.
నిజానికి కొన్ని మూవీ యూనిట్స్ ఫ్రీ పబ్లిసిటీ కోసం కావాలనే రూమర్స్ ను క్రియేట్ చేస్తాయి. మరి కొన్ని రూమర్స్, సినిమాల హైప్ ను దెబ్బతీయడానికి పుట్టుకొస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాల దర్శక నిర్మాతలు స్వయంగా రంగంలోకి దిగాల్సివస్తుంది.

“అఖిల్” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అఖిల్ అక్కినేనికి, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేసిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సినిమా వరకు హిట్ లేదు. ఆఖరికి మనం సినిమా లాంటి ఒక జ్ఞాపకాన్ని ఇచ్చిన విక్రమ్ కె కుమార్ కూడా అఖిల్ కి ఒక ప్రోపర్ హిట్ ఇవ్వలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో ఎట్టకేలకు హిట్ అందుకున్న అఖిల్, ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో “ఏజెంట్” మూవీని చేస్తున్నారు.

అయితే, దర్శక – నిర్మాతల మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని..అందుకే షూటింగ్ దశలో ఏజెంట్ ఆగిపోయిందని గత కొద్ది రోజుల నుండి తెగ ప్రచారం సాగుతుంది. అంతే కాకుండా ఈ ప్రాజెక్ట్ నుండి డైరెక్టర్ సురేందర్ రెడ్డి తప్పుకున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఈ న్యూస్ అనిల్ సుంకర కు చేరడంతో, ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు. ఏజెంట్ సినిమాకు సంబంధించీ వస్తున్న ఏ వార్తలను నమ్మొద్దు అని అన్నారు. త్వరలో కొత్త షెడ్యూల్‌ను మనాలిలో ప్రారంభించనున్నామని తెలిపాడు.

- Advertisement -

త్వరలో టీజర్ అప్‌డేట్‌ను ఇస్తామనిపేర్కొన్నారు.అలాగే, అఫీషియల్ ట్వీట్స్ మాత్రమే ఫాలో అవ్వాలని, మిగతా రూమర్స్‌ను పట్టించుకోవద్దని కోరారు. దాంతో ఇన్నిరోజులు ఏజెంట్ సినిమాకు సంబంధించి వస్తున్న వార్తలన్నీ గాసిప్స్ అని తేలిపోయింది. సోషల్ మీడియా లో కొన్ని రూమర్స్ కి ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళే స్వయంగా క్లారిటీ ఇవ్వాల్సి వస్తుందంటే మంచికంటే చేదు ఎంత త్వరగా వెళ్తుందని మనం అర్ధం చేసుకోవాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు