Ajith62: ఆ హీరోయిన్ ఫిక్స్?

కోలీవుడ్ స్టార్ హీరోల్లో అజిత్ కుమార్ ఒకరు. అభిమానులందరూ ముద్దుగా “తలా” అని పిలుస్తుంటారు. అజిత్ ప్రతి సినిమాకు భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటారు. ఈయన ఇటీవలే తునీవు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. హెచ్ వినోద్ దర్శకత్వంలో హీస్ట్ త్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక తెలుగులో తెగింపు టైటిల్ తో ఈ చిత్రం విడుదలై ఇక్కడ కూడా మంచి విజయాన్ని నమోదు చేసింది.

ఇక త్వరలో అజిత్ తన కెరీర్ లో 62వ మూవీ షూట్ లో జాయిన్ అవ్వనున్నాడు. ఈ చిత్రానికి మగిల్ తిరుమేని దర్శకత్వం వహిస్తుండగా.. కోలీవుడ్ భారీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని ఎంతో భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఈ మూవీ యొక్క ఓపెనింగ్ కార్యక్రమం ఇటీవల చెన్నైలో జరిగినట్లు తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం అజిత్ యూరప్ టూర్ లో ఉండడంతో పరిమిత యూనిట్ సభ్యుల సమక్షంలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభం అయింది. అయితే ఇప్పుడు అజిత్ అభిమానులలో జోష్ నింపే మరో అప్డేట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఏకే 62 కి సంబంధించిన వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్ లో రౌండప్ చేస్తోంది.

- Advertisement -

ఈ మూవీలో స్టార్ నటి కాజల్ అగర్వాల్ నటించనున్నారని లేటెస్ట్ కోలీవుడ్ బజ్. కాజల్ అగర్వాల్ తో ఇప్పటికే మూవీ మేకర్స్ ఒప్పందం కుదుర్చుకున్నారని, అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ ని కూడా ప్రారంభించనున్నారని తెలుస్తుంది. బాలీవుడ్, సౌత్ కు చెందిన అనేక మంది ఈ చిత్రంలో నటించనున్నారని కోలీవుడ్ మీడియా తెలుపుతుంది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు