Sarfira Movie : ఈ సినిమాతో బాలీవుడ్ కిలాడీ కం బ్యాక్ పక్కా?

Sarfira Movie : బాలీవుడ్ స్టార్ హీరో కిలాడీ అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు బాలీవుడ్ లో వరుస సక్సెస్ లతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన ఈ హీరో ఇప్పుడు ఒక్క హిట్ కోసం చాలా ఆశగా ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. దాదాపు లాక్ డౌన్ నుండి ఈ హీరోది ఇదే పరిస్థితి. ఇక హిట్టు కోసం ఎదురుచూస్తున్న హీరోలలో ఖిలాడి అక్షయ్ కుమార్ ముందు నిలుస్తాడు. ప్రీ కోవిడ్ టైంలో కెరీర్ బెస్ట్ ఫామ్ లో ఉన్నా కూడా, ఆ తర్వాత టైంలో వరుస పెట్టి ఫ్లాఫ్స్ అందుకుని కెరీర్ లో సినిమాల పరంగా చాలా డౌన్ అయ్యాడు. ఇక అక్షయ్ కుమార్ నటించిన లాస్ట్ 10 సినిమాల్లో 2 సినిమాలు మాత్రమే హిట్ గా నిలిచాయి, మిగిలిన సినిమాలు అన్నీ కూడా నిరాశ పరిచాయి. అక్షయ్ కుమార్ బెల్ బాటం, సూర్యవంశీ, బచ్చన్ పాండే, సామ్రాట్ పృద్విరాజ్, రక్షా భందన్, రామ్ సేతు, సేల్ఫీ, OMG2, మిషన్ రాణిగంజ్ మరియు లేటెస్ట్ గా బడే మియా చోటే మియా సినిమాలు రిలీజ్ అవ్వగా అందులో సూర్యవంశీ మరియు OMG2 లు మాత్రమే ఆకట్టుకున్నాయి. ఇలాంటి టైంలో కెరీర్ లో ఎట్టి పరిస్థితులలో అయినా హిట్ కొట్టాల్సిన అవసరం వచ్చింది. ఈ క్రమంలో తాజాగా విడుదలైన అక్షయ్ కుమార్ “సర్ ఫిరా” ట్రైలర్ ఆసక్తిని పెంచుతుంది.

Akshay Kumar Sarfira Movie Trailer Talk

ఆకట్టుకుంటున్న సర్ఫిరా ట్రైలర్..

ఇక అక్షయ్ కుమార్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ మూవీ సర్ ఫిరా (sarfira Movie) ఆడియన్స్ ముందుకు జులై 12 న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియా లో మంచి రెస్పాన్స్ తో ట్రెండ్ అవుతుంది. అక్షయ్ కుమార్ చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో తన సిన్సియర్ ఎఫర్ట్ పెట్టాడని అనిపిస్తుంది. ఇక మేకర్స్ కూడా సినిమా ట్రైలర్ ని గ్రిప్పింగ్ గా, కట్ చేసి సినిమాపై అంచనాలు పెంచేశారు. ఇక ఈ సినిమాతో అక్షయ్ కుమార్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కంబ్యాక్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. అయితే ఈ సినిమాతో అక్షయ్ కుమార్ కంబ్యాక్ ఖాయమని చెప్పడానికి కారణం ఉంది. కోవిడ్ టైంలో OTT లో రిలీజ్ అయ్యి సాలిడ్ హిట్ గా నిలిచిన సూర్య మరియు సుధ కొంగర కాంబోలో వచ్చిన ఆకాశం నీ హద్దుగా మూవీకి హిందీ రీమేక్ గా ఈ సినిమా రూపొందుతుంది.

- Advertisement -

అక్షయ్ కమ్ బ్యాక్ పక్కా?

ఇక సూర్య నటించిన ఆకాశమే నీ హద్దుగా ఓటిటి లో అద్భుతమైన సక్సెస్ సాధించగా, ఆ సినిమాకి సూర్య కి ఏకంగా నేషనల్ అవార్డు వరించింది. ఇక ‘సర్ ఫిరా’ సినిమా విషయానికి వస్తే.. ఒరిజినల్ సినిమాను ను డైరెక్ట్ చేసిన సుధ కొంగరనే రీమేక్ ను రూపొందిస్తూ ఉండగా, రీసెంట్ గా సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అయితే రీసెంట్ టైమ్ లో హిందీ లో రీమేక్ అయిన మూవీస్ ని చాలా వరకు చెడగొట్టారు, కానీ ఈ సినిమా విషయంలో ఒరిజినల్ డైరెక్టరే ఇక్కడ రీమేక్ చేస్తూ ఉండటం, ట్రైలర్ చూస్తూ ఉంటే ఒరిజినల్ ని ఏమాత్రం చెడగొట్టలేదు అనిపించేలా ఉండటంతో ఈ సారి అక్షయ్ కుమార్ కి కంబ్యాక్ గా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని అనిపిస్తుంది. పైగా ఆకాశమే నీ హద్దుగా ఒక బయోపిక్ సినిమా కాగా, స్ట్రాంగ్ కథాబలం ఉన్న సినిమా ఇది. అక్షయ్ కుమార్ ఈ పాత్రకి న్యాయం చేయగలడని అనిపిస్తుంది. మరి జులై 12న రిలీజ్ కాబోయే సర్ఫిరా చిత్రం ఎంత వరకూ ప్రేక్షకులని ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు