Alia Bhatt : స్వేచ్ఛగా ఆలోచిస్తున్నా..

బాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ లలో అలియా భట్ ఒకరు. ఇటీవల ఈమె IMDB భారతదేశంలో అత్యంత ప్రజాధారణ కలిగిన నటీనటుల్లో రెండో స్థానంలో నిలిచింది. అంత క్రేజ్ ఉన్న అలియా.. బాలీవుడ్ కు భట్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ – సీనియర్ నటి సోనీ రజ్దాన్ కూతురిగా అలియా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కానీ కొన్ని రోజుల్లోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. ఆర్ఆర్ఆర్, గంగూబాయి కతియావాడి వంటి హిట్ సినిమాల్లో ఈమె నటించింది.

కాగా అలియా భట్ ఈ ఏడాది ప్రారంభంలో తన ప్రియుడు, తోటి నటుడు రణబీర్ కపూర్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈమె ఇటీవల ఒక పాపకు కూడా జన్మనిచ్చింది. ఆ పాపకు రాహా అనే పేరును కూడా పెట్టారు. అయితే అలియా గర్భవతిగా ఉన్నప్పుడే డార్లింగ్స్, బ్రహ్మాస్త్ర సినిమాలు చేసింది. పాపకు జన్మనిచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక సినిమాకు కూడా సైన్ చేయలేదు. ఇది ఇలా ఉండగా మాతృత్వ జీవితాన్ని ఆస్వాదిస్తున్న అలియా భట్ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

తల్లి అయ్యాక తాను కొత్త జీవితంలోకి అడుగు పెట్టినట్లు ఉందని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా తన ఆలోచన విధానంలో కూడా చాలా మార్పులు వచ్చాయని గుర్తించినట్లు తెలిపింది. గతంలో కంటే చాలా స్వేచ్ఛగా ఉంటున్నట్టు, నిర్ణయాలను కూడా తెలికగా తీసుకుంటున్నట్టు వివరించింది. ఇది ఇప్పటి వరకు బాగానే ఉందని, కానీ సినిమా పరంగా ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అనే ఆలోచన కూడా తనకు వస్తుందని చెప్పుకొచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు