Pushpa2 : అల్లు అర్జున్ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరు ఇదే..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. తాజాగా అల్లు అర్జున్ ప్రముఖ ఓటిటి “ఆహా” లో ప్రసారం అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ 2 ఫినాలే పీసోడికి గెస్ట్ గా హాజరయ్యారు.

ఈ షో సీజన్ 2 ఫైనల్ కీ చేరుకోగా.. విజేతలకు అవార్డ్స్ ఇచ్చేందుకు బన్నీ హాజరయ్యారు. ఈ సీజన్ 2 ఫైనల్స్ కి మొత్తం 5 కంటెస్టెంట్స్ చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ ప్రోమోని తాజాగా ఆహా మేనేజ్మెంట్ రిలీజ్ చేసింది. ఈ ప్రోమోలో సింగర్స్ పాడిన పాటలకు ఫిదా అయిన అల్లు అర్జున్ వారిని అభినందించారు.

అయితే మొదటగా సింగర్ శృతి నండూరి “పిలగా.. ఇరగ.. ఇరగ” పాటను మెచ్చుకున్న అల్లు అర్జున్ ఆ సింగర్ కి “AA” పేరుతో కూడిన ఓ లాకెట్ ని గిఫ్ట్ గా ఇచ్చారు. అనంతరం బన్నీ మాట్లాడుతూ.. “నీ పేరు అంటే నాకు చాలా ఇష్టం. నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరు కూడా ఇదే” అని సిగ్గుపడుతూ చెప్పుకొచ్చారు. దీంతో ప్రస్తుతం అల్లు అర్జున్ కి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం బన్నీ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప ది రూల్” సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు