Allu Arjun : మరో అరుదైన ఘనత

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయ్యాల్సిన అవసరం లేదు. మెగా సపోర్ట్ తో హీరోగా ఎదిగిన అల్లు అర్జున్ అతి కొద్ది రోజుల్లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని ఐకాన్ స్టార్ గా పేరును సంపాదించుకున్నారు. ఇక ఈయన నటించిన పుష్ప ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. అప్పటి నుంచి బన్నీ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. పుష్ప హిట్ తర్వాత అల్లు అర్జున్ కు అవార్డులు రావాడం, రికార్డులు కొట్టడం సర్వ సాధారణం అయిపోయింది.

తాజాగా మరో అరుదైన ఘనతను అల్లు అర్జున్ సొంతం చేసుకున్నారు. ప్రతిష్టాత్మక GQ MOTY-2022 కు సంబంధించిన ‘లీడింగ్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్’ అనే అవార్డును గెలుచుకున్నారు. టాలీవుడ్ లో ఈ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్న వ్యక్తిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిలిచాడు. దీంతో అల్లు ఫ్యాన్స్ మరోసారి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ లో అల్లు అర్జునే టాప్ హీరో అని, ఈయనను ఢీ కొట్టే హీరో ఎవరూ లేరు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

కాగా అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప పార్ట్ 2 కు సర్వం సిద్ధమైంది. సుకుమార్ పకడ్బందీ గా స్క్రిప్ట్ పూర్తి చేశారు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు పూర్తి అయినట్టు సమాచారం. అతి త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుందని తెలుస్తుంది. పుష్ప 2 షూటింగ్ మొదలు కాకముందు నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. మరి ఈ అంచనాలను అందుకునేలా సినిమా ఉంటుందో లేదో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు