Allu Arjun: ఆ డైరెక్టర్ ను “ఛీ” కొట్టిన స్టార్ హీరో ..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లలో సురేందర్ రెడ్డి కూడా ఒకరు. సురేందర్ రెడ్డి అశోక్, కిక్, సైరా నరసింహారెడ్డి, రేసుగుర్రం, ధ్రువ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించారన్న సంగతి తెలిసిందే. ఈయన యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలకు ప్రేక్షకులనుంచి మంచి ఆదరణ లభించింది.

అయితే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం రేసుగుర్రం. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా వసూళ్లను రాబట్టింది. దీంతో వీళ్లిద్దరూ మరోసారి కలిసి పనిచేస్తే చూడాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. నిజానికి ఏజెంట్ సినిమా కంటే ముందే సురేందర్, బన్నీ కాంబినేషన్ లో ఒక చిత్రం చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉండడంతో.. సురేందర్ రెడ్డి ‘ఏజెంట్’ సినిమాని తెరకెక్కించారు.

ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో వారి ప్రణాళికలన్నీ బెడిసికొట్టాయి. దీంతో అల్లు అర్జున్ ఇప్పుడు సురేందర్ రెడ్డితో ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేశారట. ఏజెంట్ మూవీ పెద్ద డిజాస్టర్ కావడం.. పుష్ప మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్ హీరో అయిపోవడం.. ఇలాంటి సమయంలో సురేందర్ రెడ్డి ప్రాజెక్టు ఒప్పుకుని రిస్కులో పడటం ఎందుకని అల్లు అర్జున్ ఈ ప్రాజెక్టుని రిజెక్ట్ చేసినట్లు సమాచారం.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు