Allu Sirish : గెస్ట్ గా స్టార్ ?

అల్లు శిరీష్ కి టాలీవుడ్ లో హీరోగా నిలదొక్కుకునేందుకు ఎంతో కష్టపడుతున్నాడు. మెగా మేనల్లుడిగా, అల్లు వారి అబ్బాయిగా టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. మెగా బ్యాక్‌గ్రౌండ్, మరోవైపు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడిగా ఉన్న అల్లు శిరీష్ కు మాత్రం ఒడిదుడుకులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ లవ్ స్టోరీ తో వచ్చేశారు అల్లు శిరీష్.

“ఊర్వశివో రాక్షసివో” అనే సినిమాతో ఇప్పుడు వచ్చేశారు అల్లు హీరో శిరీష్. గీతా ఆర్ట్స్ బ్యానర్ వారు సమర్పిస్తున్న ఈ సినిమాకి విజయ్-వీరాజ్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రంలో అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. అచ్చు రాజమణి సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రానికి రాకేష్ శశి దర్శకత్వం వహించారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతం అందించగా ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్, పోస్టర్స్, టీజర్, సాంగ్స్ అన్ని ఎంతో ఆకట్టుకుని మూవీపై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఏర్పరిచాయి.

లవ్, రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో తప్పకుండా కెరీర్ పరంగా మంచి బ్రేక్ ని అందుకుంటానని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు అల్లు శిరీష్. ఇక ఈ మూవీ యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ నెల 30వ తేదీన గ్రాండ్ లెవెల్ లో నిర్వహించేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోందట. అలాగే టాలీవుడ్ టాప్ స్టార్ ఒకరు ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రానున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీని నవంబర్ 4న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ చేయనున్నారు. మరి కెరీర్ పరంగా కొంత గ్యాప్ తర్వాత ‘ఊర్వశివో రాక్షసివో’ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అల్లు శిరీష్ కు ఈ మూవీ హిట్ ఇస్తుందో లేదో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు