Anaganaga Oka Raju: హీరో నిర్మాతలు ఇద్దరు క్లారిటీ ఇచ్చేశారు , నవీన్ పోలిశెట్టి నెక్స్ట్ సెట్స్ కు వెళ్లబోయేది ఆ సినిమాకే

Anaganaga Oka Raju: ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్లో నవీన్ పోలిశెట్టి ఒకరు. ముందుగా చిన్న చిన్న సినిమాల్లో కొన్ని పాత్రలో కనిపించిన నవీన్. ఆ తర్వాత తెలుగు ఫిలిమ్స్ కి కొన్ని ఏళ్లపాటు గ్యాప్ ఇచ్చి, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధించింది. ఎక్కడిదో ఒక్కసారిగా నవీన్ పోలిశెట్టి ఫేమస్ అయిపోయాడు. ఈ సినిమా తర్వాత నవీన్ చేసిన సినిమా జాతి రత్నాలు. సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా తర్వాత మిస్టర్ శెట్టి మెసేజ్ పోలిశెట్టి అనే సినిమాను చేశాడు నవీన్. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది.

నవీన్ ఇప్పటివరకు చేసిన మూడు సినిమాలు కూడా వేరే లెవెల్ అని చెప్పొచ్చు. నవీన్ కొంత టైం తీసుకున్న కూడా క్వాలిటీ ఫిలిమ్స్ చేస్తాడు అని అందరికీ ఒక స్థాయి నమ్మకం వచ్చేసింది. నవీన్ పోలిశెట్టి ఒక సినిమాకి సైన్ చేశాడు అని అంటే ఏమీ ఆలోచించకుండా సినిమాకి వెళ్లిపోవచ్చు అని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇక ప్రస్తుతం నవీన్ నుంచి ఒక సినిమా అప్డేట్ కూడా రాలేదనుకునే టైంలో తన హెల్త్ అప్డేట్ ఇచ్చాడు.

ఈ రోజు మీతో నేనొక పర్సనల్ విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దురదృష్టవశాత్తూ, నాకు చేతి బోన్ కి తీవ్రమైన మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి, కాలికి కూడా ఇంజురీ అయ్యింది. ఇది నాకు చాలా టఫ్ అండ్ పెయిన్ ఫుల్ టైమ్. ముఖ్యంగా క్రియేటివ్ యాంగిల్ లో. ఈ ఇంజురీ వల్ల నేను ఫాస్ట్ గా మీ ముందుకు నా ఫిలిమ్స్ తీసుకురాలేకపోతున్నందుకు సారీ. గుడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు డెవలప్మెంట్ లో ఉన్న నా అప్ కమింగ్ ఫిలిమ్ స్క్రిప్ట్ అధ్బుతంగా, మీకు బాగా నచ్చే విధంగా రూపు దిద్దుకుంటున్నాయి. అంటూ నవీన్ రాసుకొచ్చాడు. అయితే దీనిపై సితార ఎంటర్టైన్మెంట్స్ నాగ వంశీ స్పందిస్తూ రిప్లై ఇచ్చాడు. ఈ రిప్లై కి మళ్ళీ నవీన్ సమాధానం ఇచ్చాడు.

- Advertisement -

Anaganaga Oka Raju

నవీన్ పోలిశెట్టి హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ లో అనగనగా ఒక రాజు అనే సినిమాని ఎప్పుడు అనౌన్స్ చేశారు. ఆ సినిమాకి సంబంధించిన రెండు నిమిషాలు వీడియో కూడా బీభత్సంగా ఆడియన్స్ను ఆకట్టుకుంది. ఆ సినిమాతోనే కళ్యాణ్ శంకర్ దర్శకుడుగా పరిచయం అవుతాడు అని అందరు అనుకున్నారు. కానీ దానికంటే ముందు మ్యాడ్ సినిమాతో దర్శకుడుగా పరిచయమయ్యాడు. ఇక అనగనగా ఒక రాజు సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఈ విధంగా హీరో నిర్మాతలు ఇద్దరు క్లారిటీ ఇచ్చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు