Anil Raavipudi: అనిల్ ప్లాన్ అదిరింది

అనిల్ రావిపూడి చేసిన పటాస్ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది,
ఆ తరువాత సాయి ధర్మతేజ్ తో చేసిన సుప్రీం సినిమాకు కూడా అదిరిపోయే రిజల్ట్ వచ్చింది.
శ్రీనువైట్ల తరువాత ఆ టైప్ అఫ్ కామెడీ రాయడంలో అనిల్ రావిపూడి మంచి పేరు సంపాదించుకున్నాడు,
ఒక మంచి కాన్సప్ట్ సినిమాకు కామెడీ ను జోడించి మాస్ మహారాజా రవితేజ తో చేసిన “రాజా ది గ్రేట్” సినిమా మంచి అయింది.

సంక్రాంతి మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని చేసిన f2 సినిమా కలక్షన్స్ వర్షం కురిపించి,ఏకంగా మహేష్ తో సినిమా చేసే అవకాశాన్ని తెచ్చిపెట్టింది.ఆ బొమ్మ కూడా సంక్రాంతి బ్లాక్ బస్టర్ అవ్వడంతో మనోడి కెరియర్ కి తిరుగులేకుండా ముందుకు వెళ్ళింది.ప్రస్తుతం F3 సినిమాని ఫినిష్ చేసిన అనిల్, తరువాత బాలయ్యతో సినిమాని చేయనున్నారు.

ఈ సినిమాలో మరో హీరో కూడా నటిస్తాడని.. అది రవితేజనే అని గతంలో వార్తలు వచ్చాయి. కానీ ఆ ప్లేస్ లో యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి నటించనున్నట్లు తెలుస్తుంది.
‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ లాంటి విభిన్నమైన సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నవీన్ పోలిశెట్టి.
నవీన్ టైమింగ్ కి అనిల్ రైటింగ్ తోడు అయితే అది బాగానే వర్కౌట్ అవుతుంది.
కాగా ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి పాత్ర ఇంటర్వెల్ లో వస్తుందని,
చాలా సీరియస్ గా సాగుతున్న ఈ సినిమా ఇంటర్వెల్ నుండి ఫుల్ కామెడీగా టర్న్ అవుతుందని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు