Animal : తమిళంలో ఎదురుదెబ్బ… ‘యానిమల్’పై రెయిన్ ఎఫెక్ట్

ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “యానిమల్” థియేటర్లలోకి రానే వచ్చింది. ప్రస్తుతం మిక్స్డ్ రెస్పాన్స్ మూట గట్టుకుంటున్న ఈ మూవీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. మూవీ ఫస్టాఫ్ అద్భుతంగా ఉందని, సెకండాఫ్ మాత్రం డిసప్పాయింట్ గా ఉందని ప్రచారం జరుగుతుంది. దీంతో మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందా లేదా ? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపాధ్యంలోనే ఈ మూవీ తమిళంలో కష్టాలు ఎదుర్కొంటుంది. ప్రస్తుతం చెన్నై ని ముంచెత్తుతున్న వర్షాలు ఈ మూవీపై ఎఫెక్ట్ చూపించే అవకాశం కనిపిస్తోంది.

బుధవారం చెన్నైతో పాటు తమిళనాడులోని ఇతర జిల్లాలో పలు భారీ వర్షం కురవగా, పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో అతలాకుతం అవుతున్న కొన్ని ప్రాంతాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాంచీపురం, చెన్నై, తిరువళ్లూరు లోని చాలా వీధుల్లో దాదాపు మోకాళ్ళ లోతు నీరు నిండిపోయింది. అంతేకాకుండా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చెన్నైలో ట్రాఫిక్ జామ్ కూడా భారీగా అవుతోంది. ఈ వర్షాల కారణంగా సహాయం అవసరమైన వారి కోసం చెన్నై కార్పొరేషన్ నగరంలో హెల్ప్ లైన్ నెంబర్లను సైతం ఏర్పాటు చేసేంతగా దిగజారింది పరిస్థితి. డిసెంబర్ 2, 3 తేదీల్లో తమిళనాడు అంతటా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. దాని ప్రకారం చూసుకుంటే ఆ రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఈ భారీ వర్షాలు, తుఫాను కారణంగా సందీప్ రెడ్డి వంగా “యానిమల్” మూవీ ఓపెనింగ్స్ పై పెద్ద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. చెన్నై వానలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉండడంతో అక్కడ ఇప్పుడు రిలీజ్ కాబోతున్న సినిమాలు అన్నింటిపైన కూడా అలాంటి ప్రభావమే పడుతుంది. ఇప్పటికే చెంగల్పట్టు, రాణి పేట, తిరువళ్లూరు, చెన్నై, కాంచీపురం వంటి జిల్లాలో పాఠశాలలకు, కళాశాలలకు సెలవు ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. దీంతో ఈ వర్షాల వల్ల తమిళనాడులో “యానిమల్” మూవీకి పెద్ద దెబ్బ పడినట్టే అని చెప్పొచ్చు. ఇలాంటి సమయంలో మంచి హైప్ నెలకొన్న ఈ మూవీ తమిళంలో ఫస్ట్ డే ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందోననే విషయం చర్చనీయాంశంగా మారింది. మరి “యానిమల్” వర్షాలతో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుందా లేదా? అనేది వేచి చూడాలి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ మూవీ మంచి కలెక్షన్స్ వసూలు చేస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు