Animal Movie Sequel : సీక్వెల్ ట్విస్ట్ రివీల్… టైటిల్ ఏంటంటే?

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న “యానిమల్” సినిమా ఈరోజు థియేటర్లలోకి వచ్చేసింది. రణబీర్ కపూర్‌తో పాటు “యానిమల్‌”లో అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న కూడా నటించారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం తన తండ్రిపై హత్యాయత్నం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడంలో నిమగ్నమైన కొడుకు కథ. ఈ హింసాత్మక యాక్షన్ ఎంటర్‌టైనర్ ఈరోజు రిలీజ్ అయ్యింది. ‘A’ రేటింగ్ తో, 203 నిమిషాలు (3 గంటల 23 నిమిషాలు) రన్ టైమ్ తో వయోలెంట్ కంటెంట్ ఉన్నప్పటికీ, ఈ చిత్రం విపరీతమైన హైప్ ని క్రియేట్ చేసింది. ప్రస్తుతం యానిమల్ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ బ్రేక్ చేసే పనిలో ఉంది. టీజర్, ట్రైలర్ లోనే మేకర్స్ కథ మొత్తం చూపించేశారు. అయితే సినిమాలో ప్రేక్షకులు చూడాల్సిన ట్విస్ట్ లు, ఆసక్తికమైన సన్నివేశాలు, అనూహ్య క్షణాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే “యానిమల్” మూవీకి సీక్వెల్ ప్రకటించి మేకర్స్ ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేశారు.

“యానిమల్” మూవీకి సీక్వెల్ ఉంటుందన్న విషయాన్ని సినిమా విడుదలకు ముందే ఫిల్మీఫై టీం తన రీడర్స్ కు ఎక్సక్లూసివ్ గా తెలిపింది. “యానిమల్” మూవీ ప్రమోషన్స్ టైంలో చిత్రబృందం “అన్స్టాపబుల్” షోకు హాజరైన విషయం తెలిసిందే. ఆ షోలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, హీరో రణబీర్ కపూర్, హీరోయిన్ రష్మిక మందన్న పాల్గొనగా, ఒకానొక సమయంలో “యానిమల్” మూవీకి సీక్వెల్ ఉంటుందని రణబీర్ నోరు జారాడు. మళ్ళీ కవర్ చేశాడనుకోండి అదే వేరే విషయం. ఇక తాజాగా మూవీ సీక్వెల్ అఫీషియల్ అనౌన్స్మెంట్ టైటిల్ తో సహా రివీల్ చేసేశారు.

ఈ రోజు తెల్లవారుజామున 1:05 గంటలకు “యానిమల్” టీం తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ లో ‘యానిమల్ పోస్ట్ క్రెడిట్ సన్నివేశాన్ని మిస్ కావద్దు’ అని ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది. ప్రేక్షకుల మైండ్ లో బాగా గుర్తుండిపోయే సన్నివేశాన్ని క్రియేట్ చేయాలనే క్రియేటివ్ ఆలోచనతో మేకర్స్ ఈ సినిమా సీక్వెల్ ను పోస్ట్ క్రెడిట్స్ లో వేశారు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. సెకండ్ పార్ట్ టైటిల్ ను కూడా ఇక్కడే రివీల్ చేశారు. “యానిమల్‌” సీక్వెల్‌కి “యానిమల్‌ పార్క్” అనే పేరు పెట్టారు. ఇక సీక్వెల్ లో కూడా రణబీర్ కపూర్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటించనున్నారు. ప్రస్తుతం “యానిమల్” మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ పైనే అందరి దృష్టి ఉంది.

- Advertisement -

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు