OMG2: బ్లాక్ బస్టర్ సిక్వెల్స్ తో పోటీ పడనున్న ఆనిమల్

బాలీవుడ్ లో ఆగస్ట్ 11న “ఆనిమల్” విడుదల అవుతుందని ఆ చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా రష్మిక మందన్న ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. హిందీలో భారీ అంచనాలున్న సినిమాల్లో ఇది కూడా ఒకటి. అయితే ముందునుంచి సోలోగా విడుదల చేద్దామనుకున్నా లేటెస్ట్ గా ఈ సినిమాకు రెండు చిత్రాల నుండి పోటీ తప్పడం లేదు. ఆ రెండు సినిమాలు కూడా గతంలో వచ్చిన సినిమాలకు సిక్వెల్స్ కావడం విశేషం.

మొదట సన్నీ డియోల్ నటిస్తున్న గదార్ 2 ఆగష్టు 11న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. ఈ సినిమా 2001 లో వచ్చిన గదార్ ఏక్ ప్రేమ్ కథ సినిమాకు సిక్వెల్ గా రూపొందింది. అప్పట్లో ఈ సినిమా అత్యధిక ప్రేక్షకులు వీక్షించిన సినిమాగా రికార్డు సృష్టించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఇక రెండో సినిమా అక్షయ్ కుమార్ హీరోగా వస్తున్న “OMG2”. ఈ సినిమా కూడా అక్షయ్ కుమార్ నటించిన “ఓ మై గాడ్” సినిమా కి సిక్వెల్ గా వస్తుంది. 2012 లో విడుదలైన ఆ సినిమా 150కోట్లకి పైగా వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాను కూడా ఆగష్టు 11న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ తాజాగా ప్రకటించారు.

- Advertisement -

అయితే ఈ సిక్వెల్ సినిమాల కంటే రణబీర్ కపూర్ నటిస్తున్న ఆనిమల్ సినిమా పైనే ఎక్కువ ఎక్స్ పెక్టషన్స్ ఉన్నాయి. అలాగని ఈ రెండు సిక్వెల్స్ ని తక్కువ అంచనా వేయలేము. ఏది ఏమైనా ఆగష్టు11 వచ్చే నాటికి ఈ మూడు సినిమాలు ఒకేరోజున విడుదలవుతాయా? లేక ఏదైనా పోస్ట్ పోన్ అవుతుందా అన్నది చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు