Anjali: అమెరికా అబ్బాయితో అంజలి పెళ్లి.. క్లారిటీ ఇదే

అంజలి తెలుగు, తమిళ చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. జర్నీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి చిత్రాలతో అంజలి తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. అచ్చ తెలుగు లో డైలాగ్స్ చెబుతూ ప్రేక్షకుల ప్రశంసలు దక్కించుకుంది. అయితే టాలీవుడ్, కోలీవుడ్ లో అంజలి-జై డేటింగ్ వ్యవహారం అందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరి ప్రేమ కథ ఓపెన్ సీక్రెట్. కలిసి ఒకే అపార్ట్మెంట్లో గడిపిన గతం కూడా వీళ్లకు ఉంది. అలాంటి వీళ్లిద్దరూ చాలా రోజుల కిందటే విడిపోయారు.

ఇది ఇలా ఉండగా, ఇటీవల నితిన్ కృతి శెట్టి జంటగా నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది అంజలి. అయితే వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న అంజలి పెళ్లి చేసుకుందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆమె భర్త అమెరికాలో ఉంటున్నారంటూ వార్తలు నెట్టింట హల్చల్ చేశాయి.

తాజాగా ఈ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు అంజలి. ప్రస్తుతం ఆమె నటించిన వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చేసింది. “ఇప్పటికే నా పెళ్లి గురించి రకరకాల వార్తలు వచ్చాయి నేను అమెరికాలోని బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయినట్లు కూడా రాశారు కానీ అది అంతా అబద్ధం ఇప్పటికైతే నాకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు కానీ రాబోవు రోజుల్లో తప్పకుండా వివాహం చేసుకుంటాను ఆ సమయం వచ్చినప్పుడు అందరికీ తప్పకుండా చెప్తాను” అంటూ చెప్పుకొచ్చింది

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు