RC15 : ఆగని లీకులు

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో ఆర్సీ 15 అనే వర్కింగ్ టైటిల్ తో ఒక చిత్రం వస్తున్న సంగతి విధితమే. దాదాపు 170 కోట్ల బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి కార్తిక్ సుబ్బరాజ్ కథ అందించడం, సాయి మాధవు బుర్ర డైలాగ్స్ రాయడంతో సినిమాపై ప్రారంభం నుంచే అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.

అలాగే ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ రెండో సారి నటిస్తోంది. ఇంత ముందు వీళ్లు బోయపాటి శ్రీను తెరకెక్కించిన వినయ విధేయ రామ చిత్రంలో కనిపించని సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, ఆర్సీ15 నుంచి ఇప్పటి వరకు చాలా లీక్స్ వచ్చాయి. స్టోరీ తో పాటు రామ్ చరణ్ గెటప్స్, కొన్ని సీన్స్ కూడా సోషల్ మీడియాలో ప్రత్యేక్షమయ్యాయి.

తాజాగా ఆర్సీ 15 మరోసారి లీకుల బారీన పడింది. ప్రస్తుతం షూటింగ్ గోదావరి తీరంలో జరుగుతుంది. అక్కడ పొలిటికల్ యాక్షన్ సీన్స్ ను తెరకెక్కిస్తున్నారు. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఈ ఫోటోల్లో రామ్ చరణ్ తో పాటు శ్రీకంత్ కలిసి ఒక బహిరంగ సభలో ఉన్నారు. అలాగే రామ్ చరణ్ భారీ కటౌట్ కూడా కనిపిస్తోంది. దీంతో చిత్ర యూనిట్ వెంటనే అప్రమత్తం అయింది. తక్షణమే ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయాలని, లేకపోతే అకౌంట్స్ బ్యాన్ అవుతాయని హెచ్చరించింది.

- Advertisement -

దీంతో ఈ ఫోటోలు, వీడియోలు ఎక్కువగా బయటకు రాలేదు. కానీ అప్పటికే చాలా మంది నెటిజన్లు ఈ లీక్ అయిన ఫోటోలను, వీడియోలను చూశారు. మీడియా ద్వారా కూడా లీక్ కాకుండా స్వయంగా రామ్ చరణ్ టీం కూడా రంగంలోకి దిగిందని తెలుస్తోంది.

లీక్ అయిన వాటిని పబ్లిష్ చెయ్యోద్దని మీడియాకు చరణ్ టీం రిక్వస్ట్ చేసిందని సమాచారం. కాగా ఇప్పటికే 85 శాతానికి పైగా షూటింగ్ పూర్తిగా చేసుకున్న ఈ చిత్రం నుంచి చిత్ర యూనిట్ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు