DJ tillu : అనుపమ పరమేశ్వరన్ కి ఎంగేజ్మెంట్ ? వరుడు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు ?

మలయాళంలో వచ్చిన ప్రేమమ్ సినిమా గురించి తెలుగులో చాలా మందికే తెలుసు. ఒకరకంగా చెప్పాలంటే ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులు మలయాళం సినిమాలు చూడటం ఎక్కువైంది. అయితే ఈ సినిమాలో మేరీ జార్జ్ పాత్రలో నటించిన అనుపమ పరమేశ్వరన్, మొదటి సినిమాతోనే అటు మలయాళం, ఇటు తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. దాంతో ఈ అమ్మడుకి తెలుగులో అవకాశాలు రావడం మొదలయ్యాయి. నితిన్ హీరోగా వచ్చిన అఆ సినిమాతో అనుపమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టింది.

మొదటి సినిమాతోనే ఆమె అందం, నటనతో తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకుంది అనుపమ. ఆ తరువాత ప్రేమమ్ సినిమాని తెలుగులో నాగ చైతన్య హీరోగా రీమేక్ చేయగా,  అనుపమ పరమేశ్వరన్ఈ సినిమాలో కూడా మలయాళంలో ఆమె చేసిన అదే పాత్రని తెలుగులో కూడా చేసింది. ఇక తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ గా ఫుల్ స్టాప్ పెట్టి, శర్వానంద్ హీరోగా వచ్చిన శతమానంభవతి సినిమాతో హీరోయిన్ పరిచయమైంది. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించటంతో అనుపమ తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయింది. ఇక ఆ తరువాత నుంచి వరుస తెలుగు, మలయాళం, తమిళ్ సినిమాలతో బిజీ హీరోయిన్ గా మారిపోయింది.

ఇటీవలనే ఆమె నిఖిల్ తో కలిసి నటించిన కార్తికేయ2, 18 పేజెస్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాల్ని సాధించాయి. ప్రస్తుతం ఈ కేరళ కుట్టి సిద్దు జొన్నగడ్డతో కలిసి టిల్లు స్కోయర్ సినిమాలో నటిస్తుంది. గతంతో వచ్చిన డీజే టిల్లు సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా రాబోతుంది. అయితే ఇంత బిజీగా ఉన్న అనుపమకుఎంగేజ్మెంట్ ఎవరితో అయింది అనుకుంటున్నారా అసలు విషయం ఏంటంటే ఆమె తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఒక ప్లాస్టిక్ కవర్ ని రింగ్ లాగా చేసి, ఆమె హ్యాండ్ కి పెట్టుకొని, ఎంగేజ్డ్ అని స్టోరీ పెట్టగా, అందరు సడన్ గా చూసి నిజమే అనుకోని చూడగా, అది కవర్ అని తెలియడంతో నిర్ఘాంతపోయారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు