Ashu Reddy : హీరోయిన్ గా చాన్స్ కొట్టేసిన ఆశు రెడ్డి

ఆషూ రెడ్డి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా కాంట్రవర్సి కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేసి ఓవర్ నైట్ లోనే స్టార్ యాంకర్ గా ఇమేజ్ ను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆ తర్వాత గ్లామర్ విందు ఇస్తూ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈమె బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొని భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంది.

బిగ్ బాస్ సీజన్ 3 లో ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమాయణం నడిపి అక్కడ మరింత పాపులారిటీని సంపాదించుకున్న ఈమె అదే క్రేజీతో బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటిటి కార్యక్రమంలో కూడా పాల్గొనింది. ఇక ఇటీవల కాలంలో హాట్ హాట్ ఫోటోలకు ఫోజులు ఇస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. రీసెంట్ గా రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ తో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన ఆషూ రెడ్డి తాజాగా మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది. సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్ గా మెరిసే అవకాశాన్ని కొట్టేసింది.

యంగ్ హీరో అరవింద్ కృష్ణ నటిస్తున్న ఏ మాస్టర్ పీస్ చిత్రంలో మెయిన్ లీడ్ గా అవకాశం దక్కించుకుంది. సుకు పూర్వజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కాండ్రగుల శ్రీకాంత్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ మూవీ త్వరలో సెట్స్ కు వెళ్లనుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు