Avatar-The way of water : 2 బిలియన్ మార్క్ చేరువలో..

సినీ లవర్స్ కి ప్రత్యేక పరిచయం అవసరం లేని సినిమా ”అవతార్”. ఈ సినిమా 2009లో రిలీజ్ అయి, బాక్స్ ఆఫీస్ నే ఆశ్చర్యపరిచింది. జేమ్స్ కామెరాన్ కెరీర్ లోనే బెస్ట్ ఫిలిమ్స్ లో ”టైటానిక్” ఒకటి. అయితే అవతార్ అవార్డుల పరంగా, మరియు కలెక్షన్స్ పరంగా ఆ సినిమా రికార్డులను చెరిపేసి సినీ ప్రపంచంలో ప్రత్యేక స్థానంలో ఉంది.

అయితే ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేసినప్పుడే, ఈ సిరీస్ ని కొనసాగిస్తానని దర్శకుడు జేమ్స్ కామెరాన్ అనౌన్స్ చేశారు. దీంతో ఈ సిరీస్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఇన్నేళ్లకు సెకండ్ పార్ట్ తెర మీదకు వచ్చింది. ఈ సారి సినిమాను అండర్ వాటర్ లో చిత్రికరించగా, దీని పేరు, ” అవతార్- ది వే అఫ్ వాటర్” అని టైటిల్ ఇచ్చారు.

160 భాషల్లో విడుదల అయిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో కలెక్షన్ల పరంగా దూసుకెళ్తుంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 1.91 బిలియన్ గ్రాస్ అమౌంట్ ను కలెక్షన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఉన్న టాక్ చూస్తే.. ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా ఇప్పటి వరకు వచ్చిన వసూళ్లులలో నార్త్ అమెరికా నుంచి అత్యధికంగా 553 మిలియన్ డాలర్లు వచ్చాయి.

- Advertisement -

కాగా ప్రస్తుతానికి ఈ సినిమా అవతార్ ఫస్ట్ పార్ట్ తో పోల్చుకుంటే.. పార్ట్ 2 తక్కువ కలెక్షన్స్ తోనే ముందుకు వెళుతోంది. రాబోయే రోజుల్లో ”అవతార్-ది వే అఫ్ వాటర్” 2 బిల్లీయూన్ డాలర్స్ మార్క్ ను టచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరి అవతార్ 1 కలెక్షన్లను రీచ్ అవుతుందా లేదా అని మరి కొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది.

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు